Train Accident: ఏనుగుల మందను ఢీకొన్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌.. పట్టాలు తప్పిన 5 బోగీలు

Train Accident: ఏనుగుల మందను ఢీకొన్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌.. పట్టాలు తప్పిన 5 బోగీలు
x

Train Accident: ఏనుగుల మందను ఢీకొన్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌.. పట్టాలు తప్పిన 5 బోగీలు

Highlights

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో శనివారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. సైరాంగ్‌ నుంచి దిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ హొజాయ్‌ జిల్లాలో పట్టాలపై ఉన్న ఏనుగుల మందను ఢీకొట్టింది.

గువాహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో శనివారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. సైరాంగ్‌ నుంచి దిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ హొజాయ్‌ జిల్లాలో పట్టాలపై ఉన్న ఏనుగుల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ఏనుగులు మృతిచెందగా, రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి.

నార్త్‌ఈస్ట్‌ ఫ్రంటియర్‌ రైల్వే అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు వేగంగా ఏనుగుల మందను ఢీకొనడంతో 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏనుగు తీవ్రంగా గాయపడింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు జరగలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

ఘటన జరిగిన వెంటనే రైల్వే, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో పలు రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.

ఈ ప్రాంతం అధికారికంగా ఎలిఫెంట్‌ కారిడార్‌ కాదని రైల్వే అధికారులు వెల్లడించారు. పట్టాలపై ఏనుగుల మందను గమనించిన లోకో పైలట్‌ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడని, అయినప్పటికీ ప్రమాదాన్ని నివారించలేకపోయామని చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories