Rajasthan political crisis: రాజస్థాన్ లో కీలక పరిణామం..

Rajasthan political crisis: రాజస్థాన్ లో కీలక పరిణామం..
x
Highlights

Rajasthan political crisis: రాజస్థాన్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

Rajasthan political crisis: రాజస్థాన్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో శనివారం సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. 12 గంటలలో ఇది రెండవ క్యాబినెట్ సమావేశం. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి నివాసంలోనే కేబినెట్ భేటీ ఉంటుందని సమాచారం. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించడంలో గవర్నర్ కలరాజ్ మిశ్రా లేవనెత్తిన అభ్యంతరాలపై అశోక్ గెహ్లోట్ , ఆయన మంత్రులు చర్చించనున్నట్లు నివేదికలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశం నిర్వహణపై గవర్నర్ కలరాజ్ మిశ్రా అయిష్టత కనబరిచిన సంగతి తెలిసిందే. దీంతో అసెంబ్లీని సమావేశ పరచరచాల్సిందిగా క్యాబినెట్ లో తీర్మానించి ఆ తీర్మానాన్ని గవర్నర్ కు పంపాలని సీఎం అశోక్ గెహ్లాట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

మరోవైపు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ త్వరలో శాసనసభా పక్ష సమావేశాన్ని కూడా నిర్వహించాలని యోచిస్తోంది. గెహ్లాట్ క్యాంప్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న హోటల్‌లో ఈ సమావేశం జరగనున్నట్టు సమాచారం. అసెంబ్లీ స్పీకర్.. పైలట్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలకు పంపిన అనర్హత నోటీసులపై యథాతథ స్థితిని కొనసాగించాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సభలో గెహ్లాట్ తన మెజారిటీని నిరూపించుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశానికి ప్రయత్నిస్తోంది. అయితే గవర్నర్ మాత్రం ప్రస్తుత పరిస్థితులలో అసెంబ్లీని సమావేశపరచడం సాధ్యం కాదని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ గవర్నర్ పై వ్యతిరేకత ప్రదర్శిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories