పక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం

Rajasthan Man Builds 6-Storey Building For Birds
x

పక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం

Highlights

* 80 అడుగుల ఎత్తులో నిర్మించిన విజయ వర్గీయ

Apartments For Birds: మండుతున్న ఎండల్లో అయినా జోరుగా కురుస్తున్న వర్షాల్లో అయినా ఉపశమనం కోసం మనమైతే ఏదో ఒక నీడనో చాటునో వెతుకుతాం అక్కడ కాసేపు సేదదీరి ఆ తరువాత వెళ్లడానికి ఇష్టపడుతాం. మనుషులకే ఇలాంటి ఉన్నాయి. మరి అదే జంతువులు, పక్షులేతై ఏం చేస్తాయి? అవి ఎలా ఆశ్రయం పొందుతాయని ఎప్పుడైనా ఆలోచించారా? అంటే వెంటనే సమాధానం చెప్పలేం కదా కానీ రాజస్థాన్‌లోని పింజర్‌పోల్‌ గోశాల సభ్యడు రాధేశ్యాం విజయ వర్గీయ అనే వ్యక్తికి మాత్రం ఈ ఆలోచన వచ్చింది. జైపూర్‌లో విపరీతమైన ఎండలు, ఉధృతమైన చలి నుంచి పక్షులను కాపాడేందుకు 6 అంతస్తుల అపార్ట్‌మెంట్లను నిర్మించాడు. అపార్ట్‌మెంట్‌ అంటే భనవనాలు కాదు పక్షుల కోసం ప్రత్యేక అపార్ట్‌మెంట్లు.

నగరాల్లో పెరుగుతున్న జనాభా కారణంగా పక్షులు అంతరిస్తున్నాయి. అవి నివసించేందుకు, ఎండలు, చలిగాలులు, భారీ వర్షాల నుంచి కాపాడుకునేందుకు ఎలాంటి ప్రదేశాలు లేవు. రాజస్థాన్‌లోని జైపూర్‌ జిల్లాలో ఈ కారణంగానే పక్షుల కోసం గౌశాల ఆరంతస్తుల అపార్ట్‌మెంట్లను నిర్మించాడు. భారీ అపార్ట్‌మెంట్లు మనుషుల కోసమే కాదు పక్షుల కోసం కూడా నిర్మించొచ్చని విజయ వర్గీయ నిరూపించాడు. విజయ వర్గీయ నిర్మించిన ఈ అపార్ట్‌మెంట్లలో 2వేల వరకు పక్షులు జీవించేందుకు అవకాశం ఉంది. ఆరంతస్తుల ఈ అపార్ట్‌మెంట్‌.. 80 అడుగుల ఎత్తులో ఉంది. పక్షుల భవనాన్ని గుజరాత్‌కు చెందిన కళకారులను ప్రత్యేకంగా రప్పించి నిర్మింపజేసినట్టు విజయ వర్గీయ తెలిపారు.

పక్షుల కోసం నిర్మించిన ఈ ఆరంతస్తుల భవానికి బర్డ్‌ తీర్థం అనే పేరు పెట్టారు. ఈ అపార్ట్‌మెంట్లకు పక్షులు వచ్చి గూడు కట్టుకుని ప్రశాంతంగా జీవించవచ్చు. పక్షులకు ఈ అపార్ట్‌మెంట్లలో అన్ని రకాల వసతులను కల్పిస్తున్నారు. ఇవే కాకుండా అక్కడి పక్షుల కోసం చిరు ధాన్యాలను, తాగునీటిని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి వసతులను చూసి పక్షులు భారీగా తరలివస్తున్నాయి. నేటి ఆధునిక కాలంలో మనిషి అతిపెద్ద అపార్ట్‌మెంట్లు కట్టుకుంటున్నాడు. కానీ పక్షుల గురించి మాత్రం మరచిపోతున్నాడంటూ విజయ వర్గీయ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ గోశాల ఆధ్వర్యంలో ఈ పక్షి తీర్థాన్ని నిర్మించినట్టు విజయ వర్గీయ తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories