Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో 11 మంది దుర్మరణం

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో 11 మంది దుర్మరణం
x
Highlights

రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్, జీప్ ఢీకొనడంతో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అలాగే ముగ్గురు తీవ్రంగా...

రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్, జీప్ ఢీకొనడంతో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అలాగే ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జోధ్పూర్ జిల్లాలోని బలోత్రా-ఫలోడి హైవేపై జరిగింది. క్షతగాత్రులను బలోత్రా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. అతివేగం కారణంగా వాహనాలు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రమాదంలో జీపు.. ట్రక్ కిందకు దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.

దగ్గరలో ఉన్న స్థానికులు గమనించి అందులో చిక్కుకున్న మరో ముగ్గురిని బయటకి తీసుకొచ్చి మోటారు సైకిల్ ద్వారా ఆసుపత్రులకు చేర్చినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని దెబ్బతిన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తీశారు. కాగా ప్రమాదాలను నివారించడానికి రవాణా శాఖ అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. ఎన్ని చేసినా దేశవ్యాప్తంగా ఇటువంటి ఘోర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories