ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు

Rains in Assam And Meghalaya
x

ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు

Highlights

Rains: అస్సాం, మేఘాలయలో వర్ష బీభత్సం

Rains: అస్సాం, మేఘాల‌యాలో భారీ వ‌ర్షాల వ‌ల్ల వ‌రద‌లు బీభ‌త్సం సృష్టించాయి. గ‌త రెండు రోజుల నుంచి వ‌ర‌ద‌ల వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో సుమారు 54 మంది మ‌ర‌ణించారు. అస్సాంలోని 28 జిల్లాల్లో దాదాపు 19 ల‌క్షల మంది ప్రభావానికి గుర‌య్యారు. ల‌క్ష మంది రిలీఫ్ క్యాంపులో ఉన్నట్లు అధికారులు చెప్పారు. అస్సాంలో 12 మృతిచెంద‌గా, మేఘాల‌యాలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

త్రిపుర రాజ‌ధాని అగ‌ర్తలాలో భారీ స్థాయిలో వ‌రద‌లు వ‌చ్చాయి. ఆ న‌గ‌రంలో సుమారు 6 గంట‌ల్లోనే 145 మిల్లీమీట‌ర్ల వ‌ర్షపాతం కురిసింది. దీంతో త్రిపుర ఉప ఎన్నిక ప్రచారంపై తీవ్ర ప్రభావం ప‌డింది. కుండపోత వర్షంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. బయటకు వచ్చేందుకు వణుతున్నారు. తాగునీరు లేక ఇబ్బందుల పడుతున్నారు.

మేఘాలయ, హిమాచల్​ప్రదేశ్​లోనూ.. బ్రహ్మపుత్ర, బరాక్ నదులు, వాటి ఉపనదుల ఉగ్రరూపంతో.. అస్సాంలోని 2వేల 930 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. బ్రహ్మపుత్ర, బేకి, మానస్‌, పగ్లాడియా, పుతిమరి, జియా-భరాలీ నదులు పొంగి పొర్లుతున్నాయి. 43వేల 338 హెక్టార్ల మేర పంట నష్టం సంభవించింది. అస్సాంముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్‌ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ వరదల ప్రభావం అధికంగా ఉంది. పలు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. కొండ చరియలు విరిగిపడి, రోడ్లు ధ్వంసమయ్యాయి.

మేఘాలయలోని చిరపుంజి, మౌసిన్‌రామ్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 1940 తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు 19 మంది చనిపోగా.. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సంగ్మా 4 లక్షల పరిహారం ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories