గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్

గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్
x
Highlights

లాక్‌డౌన్‌ను మే 31తో ముగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన ట్వీట్ పరోక్ష సంకేతాలిచ్చింది. జూన్ 1...

లాక్‌డౌన్‌ను మే 31తో ముగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన ట్వీట్ పరోక్ష సంకేతాలిచ్చింది. జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా రోజుకు 200 నాన్ ఏసీ రైళ్లను టైమ్ టేబుల్ ప్రకారం నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించినట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. ఈ రైళ్ల టికెట్ల బుకింగ్ కోసం త్వరలోనే ఆన్‌లైన్ రిజర్వేషన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ నుంచి దేశంలోని పలు రాష్ట్రాలకు, రాష్ట్రాల నుంచి ఢిల్లీకి కొన్ని ప్రత్యేక రైళ్లను రైల్వే నడుపుతోంది. వీటికి తోడు వలస కూలీలను తరలించే రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి అయితే రిజర్వేషన్‌ ప్రక్రియ ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందనే విషయం తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories