logo
జాతీయం

Ticketless Travellers in Railways: టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్ర‌యాణం.. జ‌రిమానాల ద్వారా భారీ మొత్తం

Ticketless Travellers in Railways: టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్ర‌యాణం.. జ‌రిమానాల ద్వారా భారీ మొత్తం
X

 టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్ర‌యాణం.. జ‌రిమానాల ద్వారా భారీ మొత్తం 

Highlights

Ticketless Travellers in Railways: రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్ర‌యాణం చేసి వారి సంఖ్య భారీగానే పెరిగిపోతుంది. ఇందుకు జరిమానా కింద వసూలు చేసిన మొత్తమే నిదర్శనం.

Ticketless Travellers in Railways: రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్ర‌యాణం చేసి వారి సంఖ్య భారీగానే పెరిగిపోతుంది. ఇందుకు జరిమానా కింద వసూలు చేసిన మొత్తమే నిదర్శనం. దేశ‌వ్యాప్తంగా టికెట్ లేకుండా ప్ర‌యాణం చేసిన వారి నుంచి జరిమానాల ద్వారా 2019-20లో రూ.561.73 కోట్లు ఆదాయం వచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. సుమారు 1.10 కోట్ల మంది ప్రయాణికుల నుంచి జరిమానాల రూపంలో ఈ మొత్తాన్ని రాబట్టినట్లు వెల్లడించింది. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయగా ఈ స‌మాచారాన్ని రైల్వేశాఖ‌ వెల్ల‌డించింది.

టికెట్‌ లేని ప్రయాణికుల ద్వారా 2016-20 మధ్య కాలంలో సుమారు రూ.1,938 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించగా... నాలుగేళ్లలో 38 శాతానికిపైగా ఆదాయం వృద్ధి సాధించినట్లు రైల్వేశాఖ‌ వెల్లడించింది. 2016-17లో రూ. 405.30 కోట్లు, 2017-18లో రూ. 441.62 కోట్లు, 2018-19లో రూ. 530.06 కోట్లు జరిమానాల రూపంలో వసూలు చేసింది. ఇలాంటి ప్ర‌యాణాల‌ను త‌గ్గించ‌డానికి మ‌రిన్ని ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌డుతామ‌ని, పండగ సీజన్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తున్న వారిని వదిలిపెట్టమని, భద్రతను మరింత పెంచేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుందని అధికారులు వెల్లడించారు.

Web TitleRailways earned Rs 561 crore from ticketless travellers in 2019-20
Next Story