Rahul Gandhi: లడాఖ్‌‌లోని లేహ్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi Visited Leh In Ladakh
x

Rahul Gandhi: లడాఖ్‌‌లోని లేహ్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ

Highlights

Rahul Gandhi: రేపు రాజీవ్ జయంతిని కూడా సరస్సు దగ్గరే జరుపుకోనున్న రాహుల్

Rahul Gandhi: కేంద్ర పాలిత ప్రాంతం లడాఖ్‌ లోని లేహ్‌ లో పర్యటించారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ఈ సందర్భంగా శనివారం ఆయన బైక్‌ రైడ్‌ చేస్తూ భారత్‌-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సు కు చేరుకున్నారు. రైడ్‌ ప్రారంభానికి ముందు రాహుల్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్‌ సరస్సు ఒకటన్నా మా నాన్న చెప్పేవారన్నారు. ఇందుకు సంబంధించిన ఈ రాత్రికి ఆయన పాంగాంగ్‌ సరస్సు దగ్గర ఉన్న టూరిస్ట్‌ క్యాంప్‌లో బస చేస్తున్నారు.ఆగస్టు 20న తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతిని రాహుల్‌ ఈ సరస్సు వద్దే చేసుకోనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. గత గురువారం రాహుల్‌ లేహ్‌ పర్యటనకు వచ్చారు. తొలుత రెండు రోజుల పాటే ఇక్కడ ఉండాలని భావించినా.. ఆగస్టు 25 వరకు తన పర్యటనను పొడిగించుకున్నారు. 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత రాహుల్‌ లద్దాఖ్‌కు రావడం ఇదే తొలిసారి.

Show Full Article
Print Article
Next Story
More Stories