నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi To Attended ED From Today
x

నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న రాహుల్ గాంధీ

Highlights

Rahul Gandhi: ఇప్పటికే మూడు రోజులపాటు విచారణకు హాజరైన రాహుల్

Rahul Gandhi: రాహుల్ గాంధీని నేడు ఈడీ మరోసారి ప్రశ్నించనుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే గత వారంలో ఈడీ అధికారులు రాహుల్ ను మూడుసార్లు విచారించారు. ఈ నెల 17న విచారణకు రావాలని ఈడీ సమాన్లు జారీ చేయగా.. మూడు రోజుల సమయం కావాలని రాహుల్ కోరారు. సోనియా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. అందుకే ఈ నెల 17న కాకుండా, 20న విచారణకు హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. రాహుల్ అభ్యర్థనను ఈడీ అంగీకరించడంతో ఇవాళ ఆయన విచారణకు హాజరకానున్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ప్రశ్నించారు. మొత్తం 28 గంటల పాటు విచారణ జరిపారు. యంగ్ ఇండియన్ కంపెనీ కార్యకలాపాలు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులతో పాటు పలు అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. రాహుల్ సమాధానాలను ఆడియో, వీడియో రూపంలో భద్రపరిచారు. అయితే విచారణలో ఇంకా అనేక సందేహాలు ఉన్నాయన్న ఈడీ అధికారులు మరోమారు విచారణకు రావాలని రాహుల్ ను ఆదేశించారు.

రాహుల్, సోనియా గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు యాజమాన్య సంస్థ. అయితే, యంగ్ ఇండియన్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ బకాయి పడ్డ సుమారు 90 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం 50 లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2012లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాగంగా ఇప్పుడు ఈడీ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తోంది.

మరోవైపు, ఈడీ విచారణను నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆరోపిస్తూ.. ఇవాళ కేంద్రప్రభుత్వ కార్యాలయాల ముందు కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలపనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories