Top
logo

ఓటర్లకు లేఖ రాసిన రాహుల్‌ గాంధీ

ఓటర్లకు లేఖ రాసిన రాహుల్‌ గాంధీ
X
Highlights

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, అమేథి లోక్‌సభ అభ్యర్థి రాహుల్‌ గాంధీ అక్కడి ప్రజలకు లేఖ రాశారు. 'మేరా...

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, అమేథి లోక్‌సభ అభ్యర్థి రాహుల్‌ గాంధీ అక్కడి ప్రజలకు లేఖ రాశారు. 'మేరా అమేథి పరివార్' అంటూ సంబోధిస్తూ రాసిన ఈ లేఖలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. బీజేపీ అబద్ధాల కర్మాగారమని, ఓటర్లకు ప్రవాహంలా డబ్బును పంచిపెడుతూ మభ్యపెడుతున్నారని లేఖలో ఆరోపించారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు ఇక్కడి ప్రజలకు చేరకుండా అమేథిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారని, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటన్నింటిన ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటానని లేఖలో రాహుల్‌ పేర్కొన్నారు.

Next Story