రాహుల్‌కు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసు

రాహుల్‌కు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసు
x
Highlights

రఫేల్‌ తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ధిక్కార నోటీసులు జారీ చేసింది. రాహుల్‌ తన అఫిడవిట్‌లో విచారం వ్యక్తం...

రఫేల్‌ తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ధిక్కార నోటీసులు జారీ చేసింది. రాహుల్‌ తన అఫిడవిట్‌లో విచారం వ్యక్తం చేసినప్పటికీ ఈ పిటీషన్ ను సుప్రీం తోసిపుచ్చింది. కాగా రాఫెల్ డీల్‌కు సంబంధించి లీకైన డాక్యుమెంట్లపై సమీక్షకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంలో రాహుల్ మోదీపై 'చౌకీదార్' విమర్శలు చేశారు. ఇది తమ నైతిక విజయం అని, 'కాపలదారుడే దొంగ'(చౌకీదార్ చోర్) అని సుప్రీం స్పష్టం చేసిందని చెప్పారు. అయితే చౌకీదార్ చోర్ అని తాను చేసిన వ్యక్తిగత విమర్శలను కోర్టు తీర్పుకు ఆపాదించడంపై.. బీజేపీ కోర్టు ధిక్కరణ కింద ఆయనపై పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ నెల 30వ తేదీన రఫేల్‌పై రివ్యూ పిటిషన్‌తోపాటే, కోర్టు ధిక్కార పిటిషన్‌పైనా విచారణ జరుపుతామని తెలిపింది. కోర్టు ఉత్తర్వుల మేరకు రాహుల్‌ సోమవారం వివరణ ఇచ్చారు. అందులో 'రాజకీయ ప్రచారం వేడిలో కోర్టు తీర్పుపై తప్పుడు ప్రకటన చేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. నా ప్రకటనను బీజేపీ నేతలు వక్రీకరించారు' అని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories