logo
జాతీయం

Rahul Gandhi: కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ

Rahul Gandhi Fires on BJP Government | Telugu News
X

కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ

Highlights

Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థల్లో దూరిపోయింది

Rahul Gandhi: రాహుల్ గాంధీ కేంద్ర సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థ కనుమరుగైపోయిందని, దాని స్థానంలో వ్యవస్థల విధ్వంసం మాత్రమే జరుగుతోందన్నారు. అన్ని వ్యవస్థల్లో ఆర్ఎస్ఎస్ ప్రవేశించడంతో రాజ్యాంగ వ్యవస్థ ధ్వంసమైందన్నారు. మహాత్మా గాంధీ మీద కాల్పులు జరిగిన రోజే ప్రజాస్వామ్యం చనిపోయిందంటూ మరోసారి తేనెతుట్టెను కదిపారు.

యూపీలో మాయావతి అసలు పోటీ చేసిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని సూచించానని మాయావతి అందుకు ఒప్పుకోకుండా బీజేపీకి తివాచీ పరచిందన్నారు. ఈడీ, సీబీఐ, పెగాసస్ వంటి అంశాలకు మాయావతి భయపడిపోయి తలొగ్గిందన్నారు. ఢిల్లీలోని జవహర్ నగర్ లో జరిగిన ఓ బుక్ రిలీజ్ ఫంక్షన్లో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Web TitleRahul Gandhi Fires on BJP Government | Telugu News
Next Story