Rahul Gandhi: అదానీ గ్రూప్ షేర్లలో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగింది

Rahul Gandhi Fire On Central Government
x

Rahul Gandhi: అదానీ గ్రూప్ షేర్లలో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగింది

Highlights

Rahul Gandhi: అదానీ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే

Rahul Gandhi: అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల్లో అవకతవకలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత గౌతమ్‌ అదానీ కొందరు ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన వ్యక్తి కావడంతో.. అతని కంపెనీల్లో అక్రమాలపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌లో అదానీ అంశం చర్చకు రావద్దన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ప్రతిపక్ష సభ్యులు పట్టుబడుతున్నా ప్రభుత్వం లెక్కచేయడం లేదని రాహుల్‌గాంధీ విమర్శించారు. ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగేలా రెచ్చగొట్టి ఆ తర్వాత సభను వాయిదా వేయిస్తున్నదని మండిపడ్డారు. అదానీ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం అనుమతించాల్సిందేనని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. అదానీ వెనుక ఏ శక్తి పనిచేస్తుందో దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories