కర్ణాటక టూర్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..

Rahul Gandhi Attended Siddaramaiah Marks 75th Birthday
x

కర్ణాటక టూర్  లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..

Highlights

Rahul Gandhi: దావణగెరెలో కర్ణాటక మాజీముఖ్యమంత్రి సిద్ధరామయ్య 75వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు

Rahul Gandhi: ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్న బీజేపీపై రాజీలేని పోరాటనికి సిద్ధంకావాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దావణగెరెలో కర్ణాటక మాజీముఖ్యమంత్రి సిద్ధరామయ్య 75వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. సిద్ధరామయ్యను ఘనంగా సత్కరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బాధ్యతాయుతంగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.

కష్టపడి పనిచేసినవారి శ్రమ వృధాకాదని పదవులు పొందిన సిద్ధరామయ్యను ఉదహరించారు. కర్ణాటకలో సిద్ధరామయ్య దార్శనికతతో పాలన అందించి అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందించారన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ శ్రేణులు బీజేపీని ఓడించేందుకు సైనికుల్లా పోరాడాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికోసం డీకే శివకుమార్, సీనియర్ నాయకులు ఎస్ఆర్ పాటిల్‌, సిద్ధరామయ్య పాటుపడుతున్నారని అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories