రాఫేల్ కేసులో కేంద్రానికి ఊరట

రాఫేల్ కేసులో కేంద్రానికి ఊరట
x
Highlights

రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం కేసులో కేంద్రానికి ఊరట లభించింది. రాఫేల్ సమీక్ష పిటిషన్నంటిని కోర్టు తిరస్కరించింది. రాఫేల్‌పై గతంలో ఇచ్చిన...

రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం కేసులో కేంద్రానికి ఊరట లభించింది. రాఫేల్ సమీక్ష పిటిషన్నంటిని కోర్టు తిరస్కరించింది. రాఫేల్‌పై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల డీల్ లో గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లనూ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రాఫెల్ డీల్ వెనుక మోదీ సర్కారు అక్రమాలకు పాల్పడిందని గతంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం, తీర్పును వెలువరించింది.

రాఫెల్ డీల్ వెనుక ఎటువంటి అక్రమాలూ లేవని, నిబంధనల ప్రకారమే డీల్ కుదిరిందని కోర్టు అభిప్రాయపడింది. గతంలో తామిచ్చిన తీర్పునకు కట్టుబడే ఉంటున్నామని స్పష్టం చేసింది. గత సంవత్సరం డిసెంబర్ 14న రాఫెల్ ఫైటర్ జెట్స్ డీల్ పై తీర్పిచ్చిన సుప్రీంకోర్టు, అప్పటివరకూ ఉన్న కేసులను కొట్టివేసింది. ఆపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం, అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. రాఫెల్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

రక్షణ సన్నద్ధతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నామన్నారు. రక్షణకు సంబంధించి ఏ విషయంపై కూడా రాజకీయాలు చేయకూడదన్నారు. కొందరు కేవలం వారి రాజకీయ లబ్ధి కోసం ఈ వ్యవహారంపై రాజకీయాలు చేశారని తెలిపారు. కాంగ్రెస్‌లోని అగ్రనేతలే ప్రధానిని అపఖ్యాతి చేయడానికి ప్రయత్నించారని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి యత్నించిన వారు క్షమాపణలు చెప్పాలని రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు.

రాఫెల్ విషయంలో సత్యమే గెలిచిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మోడి ప్రభుత్వ పాలన, నిర్ణయాలు ఎంతో పారదర్శకత, నిజాయతీతో కూడినవని ఈ తీర్పు రుజువు చేస్తోందని అన్నారు. రాఫెల్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాఫెల్‌ జెట్ విమానాల కొనుగోలుపై మోడీ సర్కార్‌కు క్లీన్ చిట్ లభించడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories