ఉత్తరాఖండ్‌లో విషాదం: ఓ పరికరమే కారణం.. సంచలనం రేపుతున్న అధికారి వ్యాఖ్యలు

Uttarakhand Flash Floods
x

Uttarakhand Flash Floods(The handsIndia filePhoto)

Highlights

*హిమనీనదం విరిగిపడటం కాదట *1965లో వదిలేసిన ఓ పరికరమే విషాదానికి కారణమట *సంచలనం రేపుతున్న అప్పటి అధికారి వ్యాఖ్యలు

చల్లని మంచు పర్వతం.. అహ్లాదకరమైన వాతావరణం.. కానీ ఒక్కసారిగా హిమనీనదం ఉగ్రరూపం దాల్చింది. మంచు చరియలు విరిగిపడ్డాయి. ధౌలిగంగా నది భీకర వరదతో పోటెత్తింది. దేవభూమి స్మశానంలా మారింది. ఊహించని విధంగా ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయి. మరీ హిమనీనదం ఉగ్రరూపం ప్రకృతి ప్రకోప ఫలితమా.. అప్పటి అధికారుల నిర్లక్ష్యమా.. ఉత్తరాఖండ్‌ జలప్రళయం వెనుక ఉన్న కారణాలేంటి.? కారకులెవరు.? లెట్స్ వాచ్ దిస్‌ స్టోరీ..

ఉత్తరాఖండ్‌ చమేలీ జిల్లాలో తపోవన్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది. కార్మికులంతా ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా ధౌలిగంగా మహోగ్ర రూపాన్ని దాల్చింది. భీకర ప్రవాహానికి తపోవన్ హైడ్రో ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిపోయింది. ఈ ఘటనలో వందలాది మంది కార్మికులు గల్లంతయ్యారు.

ప్రాజెక్ట్‌ నిర్మాణాలన్నీ నేలమట్టం అయ్యాయి. కళ్లు మూసి తెరిచేలోగా అంతా సర్వనాశనం అయ్యింది. నందాదేవి నేషనల్ పార్క్‌ కోర్ జోన్‌లో గ్లేసియర్ విరిగిపడ్డాయి. ఆ మంచు చరియలు పవిత్ర ధౌలి గంగాలో పడ్డాయి. ఇంకేముంది ధౌలిగంగా ఉగ్రరూపంతో ప్రవహించింది. ఆ ధాటికి సమస్తం సమాప్తమైంది.

ఈ జల ప్రళయాన్ని చూసిన యావత్‌ భారతం ఉలిక్కిపడింది. అంతా ప్రకృతి ప్రకోపం అనుకున్నారు. కానీ సమీపంలోని రైనీ గ్రామస్తులు ప్రకృతి ప్రకోపం మొదటి నుంచి వాధిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమని ఆరోపించారు. ఆ ఆరోపణలే అక్షర సత్యమని అంటున్నారు దిగ్గజ పర్వతారోహకుడు కెప్టెన్‌ ఎంఎస్ కోహ్లి. ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యానికి ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో రుజువు చేస్తున్నాయి.

56 ఏళ్ల కిందట అప్పటి అధికారులు నందాదేవి శిఖరంపై ఓ రేడియో యాక్టివ్ పరికరాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఉండే అణుశక్తి జనరేటర్‌ అత్యంత శక్తివంతమైనది. హిరోషిమాలో పేలిన అణుబాంబు సామర్థ్యానికి సగం శక్తితో ఈ జనరేటర్‌ను రూపొందించారు. ఆ జనరేటర్‌ నందాదేవి శిఖరంపై 1966లో మిస్సైందని ఎంస్‌ కోహ్లి వెల్లడించారు. కనిపించకుండా పోయిన జనరేటర్‌ ఇప్పుడు పేలి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

1964లో షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో చైనా.. అణు బాంబును పరీక్షించింది. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు 1965లో అమెరికా గూఢచర్య సంస్థ 'సీఐఏ', భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో, స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ కూడిన స్పెషల్‌ టీం నందా దేవి హిమానీనదంపై రేడియో ధార్మిక పరికరాన్ని ఉంచింది. ఈ టీంలో ఎంఎస్‌ కోహ్లికూడా ఒక్కరూ.

25 వేల అడుగుల ఎత్తులో ఉన్న నందా దేవి శిఖరాగ్రానికి ఆ పరికరాన్ని తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలో వాతావరణం ప్రమాదకరంగా మారిపోయిందని కోహ్లీ చెప్పారు. ఆ పరికరాన్ని కిందకు ఈడ్చుకొచ్చే పరిస్థితి లేదని చెప్పారు. అందుకే దానిని అక్కడే వదిలేసి వచ్చామని అన్నారు.

తర్వాత అణుశక్తి జనరేటర్‌ కోసం మూడేళ్లు శ్రమించినా ఫలితం లేదని చెప్పుకచ్చారు. హిరోషిమాపై వేసిన అణుబాంబు సామర్థ్యంలోని సగం శక్తి ఈ జనరేటర్‌కు ఉందన్నారు. ఆ పరికరంలోని జనరేటర్‌ సాధనం గల్లంత్తవ్వడంతో తీవ్ర కలవరం సృష్టించింది. చాలా వేడిగా ఉన్న ఆ జనరేటర్‌ హిమానీనద మంచును కరిగించుకుంటూ కిందకు జారిపోయి ఉంటుంది.

25వేల అడుగుల ఎత్తులో ఆ పరికరాన్ని పెట్టాలన్న సీఐఏ నిర్ణయం తప్పని కోహ్లీ ఇప్పుడు అంటున్నారు. 22వేల అడుగుల ఎత్తులోని నందా కాట్‌ డోమ్‌ వద్ద అమరిస్తే సరిపోతుందని తాను వాదించినట్లు గుర్తుచేశారు. 1967లో లద్దాఖ్‌లోని ఖర్‌దుంగ్లా పాస్‌లోని 18,300 అడుగుల ఎత్తులో మరో పరికరాన్ని ఉంచాం. అది చైనా అణు సంకేతాలను అద్భుతంగా పసిగట్టింది'' అని చెప్పారు.



Show Full Article
Print Article
Next Story
More Stories