Tamilnadu: వృద్ధురాలి మెడపై కరిచిన కరోనా వైరస్ క్వారంటైన్‌ వ్యక్తి

Tamilnadu: వృద్ధురాలి మెడపై కరిచిన కరోనా  వైరస్ క్వారంటైన్‌ వ్యక్తి
x
Highlights

శ్రీలంక నుండి తిరిగి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తికి COVID-19 మహమ్మారి పరీక్షలు చేశారు. అతను శ్రీలంకలో బట్టల వ్యాపారం చేసేవాడు.. ఇటీవల తమిళనాడులోని తన స్వగ్రామానికి వచ్చాడు.

శ్రీలంక నుండి తిరిగి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తికి COVID-19 మహమ్మారి పరీక్షలు చేశారు. అతను శ్రీలంకలో బట్టల వ్యాపారం చేసేవాడు.. ఇటీవల తమిళనాడులోని తన స్వగ్రామానికి వచ్చాడు.ఈ క్రమంలో కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నాడు. కుటుంబసభ్యులు అతనికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అతనికి పరీక్షలు చేసినా కరోనా వైరస్ నెగిటివ్ అని వచ్చింది. అయినా అతను విదేశాలకు ప్రయాణ చరిత్ర కలిగి ఉన్నాడన్న కారణంతో అతన్ని హోమ్ క్వారైటైన్ వార్డులో ఉంచారు.

కానీ అక్కడ ఉండటానికి ఇష్టపడని ఆ వ్యక్తి క్వారైటైన్ వార్డు నుంచి కుటుంబసభ్యులు వారిస్తున్నా అక్కడినుంచి తప్పించుకున్నాడు.. అనంతరం వృద్ధురాలిని బలితీసుకున్నాడు. క్వారైటైన్ వార్డు నుంచి నగ్నంగా బయటకు వెళ్లి 80 ఏళ్ల మహిళ మెడ కొరికాడు.. తీవ్ర రక్తస్రావమైన ఆ వృద్ధురాలిని శుక్రవారం ఆసుపత్రిలో చేర్పించారు, చికిత్స సమయంలో ఆమె పరిస్థితి విషమంగా మారింది. దాంతో శనివారం మరణించినట్లు పోలీసులు తెలిపారు.

కాగా నిందితుడు, మణికందన్, 2010 లో మదురైలో మానసిక అనారోగ్య చికిత్స పొందిన చరిత్రను కలిగి ఉన్నాడు. శుక్రవారం, అతను తనను తాను తిట్టుకుంటూ క్వారైటైన్ వార్డు నుంచి పారిపోయాడు. ఏ క్రమంలో అతను తన ఇంటి నుండి వంద మీటర్ల దూరంలో ఉన్న వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకున్నాడు , ఆమె ఇంటి బయట కూర్చుని ఉండగా ఒక్కసారిగా ఆమెపై దాడి చేసినట్టు అని ఒక పోలీసు అధికారి చెప్పారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీలంక నుండి మణికందన్ తిరిగి వచ్చినప్పటి నుండి, అక్కడ తన వ్యాపారం నష్టాల గురించి తీవ్ర మనోవేదన చెందాడని.. ఈ క్రమంలో తమిళనాడు వచ్చిన తరువాత అతనిని ఒంటరిగా ఉంచడంతో అతను మరింతగా ఇబ్బంది పడ్డాడని ఈ క్రమంలోనే ఇలా ప్రవర్తించాడని చెప్పారు. అతనిపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories