ఆన్సర్ షీట్ లో రూ.100 పెట్టండి పాస్ గ్యారెంటీ.. అంటూ అడ్డంగా దొరికిపోయిన ప్రిన్సిపాల్

ఆన్సర్ షీట్ లో రూ.100 పెట్టండి పాస్ గ్యారెంటీ.. అంటూ అడ్డంగా దొరికిపోయిన ప్రిన్సిపాల్
x
Highlights

బోర్డు పరీక్షల్లో విద్యార్థులను మోసం చేసేలా తెలివితేటలు ప్రదర్శించిన ఓ ప్రిన్సిపాల్ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. బోర్డు పరీక్షల్లో చదవకుండా ఎలా...

బోర్డు పరీక్షల్లో విద్యార్థులను మోసం చేసేలా తెలివితేటలు ప్రదర్శించిన ఓ ప్రిన్సిపాల్ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. బోర్డు పరీక్షల్లో చదవకుండా ఎలా పాసవ్వాలో విద్యార్థులకు చిట్కాలు ఇస్తూ కెమెరాకు చిక్కాడు. దీంతో ఉత్తరప్రదేశ్ పాఠశాల ప్రిన్సిపాల్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర ప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (యుపిఎస్‌ఇబి) పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. లక్నో నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాల మేనేజర్-కమ్-ప్రిన్సిపాల్ అయిన ప్రవీణ్ మాల్ ఈ పరీక్షలను క్యాష్ చేసుకోవాలని భావించాడు.

అందుకు ఓ పథకం రచించాడు. రూ. 100 లతో ఎలా పాసవ్వాలో విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించాడు.. అయితే అతను ప్రసంగిస్తున్న సమయంలో ఓ విద్యార్థి తన మొబైల్ ఫోన్‌లో రహస్యంగా చిత్రీకరించాడు. దాంతో దొరికిపోయాడు.. ఆ వీడియో క్లిప్‌లో మాల్ కొంతమంది తల్లిదండ్రుల సమక్షంలో, బోర్డు పరీక్షలలో ఎలా మోసం చేయాలో.. ఎలా పాస్ అవ్వాలో.. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కఠినమైన చర్యల నుండి ఎలా తప్పించుకోవాలో విద్యార్థులకు ఒక ప్రసంగం ఇవ్వడం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫిర్యాదుల పోర్టల్‌లో విద్యార్థి ఫిర్యాదు తోపాటు ఆ క్లిప్‌ను అప్‌లోడ్ చేశాడు. అందులో పూర్తిగా చూస్తే.. "నా విద్యార్థులు ఎవ్వరూ విఫలమవ్వరని నేను సవాలు చేయగలను ... ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు" అని మాల్ దాదాపు రెండు నిమిషాల నిడివి గల క్లిప్‌లో చెప్పారు.

"మీరు మధ్య మధ్యలో ఎవరి చేతులను తాకకుండా మాట్లాడుకోకుండా పేపర్లు రాయవచ్చు. మీరు ఒకరితో ఒకరు భయపడకుండా మాట్లాడుకోండి...మీ ప్రభుత్వ పాఠశాల పరీక్షా కేంద్రాల్లోని ఉపాధ్యాయులు నా స్నేహితులు. అయినప్పటికీ మీరు ఇబ్బందుల్లో చిక్కుకున్నా మీకు ఒక చెంపదెబ్బ లేదంటే రెండు ఇస్తారు, భయపడకండి. వారితో భరించండి "అని అతను ఆ వీడియో క్లిప్‌లో చెబుతున్నాడు. ఈ క్రమంలో జనంలోని కొంతమంది అతని మాటలకూ స్పందిస్తూ: " సాహి హై (ఇది బాగుంది)" అని అన్నారు.

ఆ తరువాత "మీరు సమాధాన పత్రాలలో సమాధానాలు ఇవ్వకుండా.. అందులో కేవలం 100 రూపాయల నోటు ఉంచండి... ఉపాధ్యాయులు మీకు గుడ్డిగా మార్కులు ఇస్తారు. మీరు ఒక ప్రశ్నకు తప్పుగా సమాధానం ఇచ్చినా, అది నాలుగు మార్కుల ప్రశ్న అయినా.. వారు మీకు మూడు మార్కులు ఇస్తారు, అని జై హింద్, జై భారత్ " నినాదంతో ఆయన తన మాటలను ముగించారు. అయితే ఈ వీడియోను ఆ విద్యార్థి అధికారులకు అందజేయడంతో అతను దొరికిపోయాడు. దాంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

కాగా మంగళవారం నుంచి ప్రారంభమైన రాష్ట్ర బోర్డు పరీక్షలకు 10, 12 వ తరగతులకు చెందిన సుమారు 56 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అయితే మోసాలకు పాల్పడే ఇటువంటి వ్యక్తులను అరెస్టు చేయడానికి ఈ సంవత్సరం యుపి ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో సిసిటివి నిఘా మరియు మానిటర్ వాయిస్ రికార్డింగ్ కోసం రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ మరియు నియంత్రణ గదిని ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలోని 75 జిల్లాల్లో మొత్తం 7,784 కేంద్రాల్లో దాదాపు రెండు లక్షల సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేశారు. సుమారు రెండు లక్షల ఇన్విజిలేటర్లు విధుల్లో ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (యుపిఎస్‌ఇబి) 938 సెన్సిటివ్ కేంద్రాలను, అలాగే 395 "హైపర్-సెన్సిటివ్" కేంద్రాలను గుర్తించింది, ఈ కేంద్రాలు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నట్టు అంచనా వేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories