Fauja Singh Sarari: పంజాబ్‎లో దుమారం రేపుతున్న మంత్రి సరారీ వ్యాఖ్యలు

Fauja Singh Sarari: పంజాబ్‎లో దుమారం రేపుతున్న మంత్రి సరారీ వ్యాఖ్యలు

Rama Rao
Updated on: 26 Oct 2022 8:30 PM IST
Fauja Singh Sarari: పంజాబ్‎లో దుమారం రేపుతున్న మంత్రి సరారీ వ్యాఖ్యలు
X

Fauja Singh Sarari: నోరు జారిన పంజాబ్‌ మంత్రిపై ఆప్‌ అధిష్ఠానం చర్యలకు సిద్ధమైంది. ఆప్‌ నాయకత్వం జారీ చేసిన నోటీసుకు మంత్రి ఏ మాత్రం స్పందించకపోవడంతో.. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ల నుంచి డబ్బు దోచుకుంటున్నారంటూ మంత్రి సరారీ వ్యాఖ్యల ఆడియో క్లిప్‌ వైరల్‌ కావడంతో ఆప్‌కు తలనొప్పిగా తయారైంది. మంత్రి సరారీని మంత్రివర్గం నుంచి తప్పించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే మంత్రి సరారీ మాట్లాడినట్లుగా చెప్తున్న ఆడియో క్లిప్పింగ్‌ వైరల్‌గా మారడంతో సరారీ నుంచి సంజాయిషీ కోరుతూ ఆప్‌ అధిష్ఠానం నోటీసు పంపింది. అయితే నోటీసులిచ్చిన నెల రోజులు కావస్తున్నా సరారీ స్పందించలేదని పార్టీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. దీంతో దీనిపై సీరియస్ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.. వీలైనంత త్వరగా మంత్రి సరారీపై చర్యలు తీసుకోవాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తున్నది.

Rama Rao

Rama Rao

Next Story