Breaking News: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌ రాజీనామా

Punjab Chief Minister Captain Amarinder Singh has Resigned
x

సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా(ట్విట్టర్ ఫోటో)

Highlights

* గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన కెప్టెన్ * అమరీందర్ సింగ్‌తో పాటు మంత్రుల రాజీనామా లేఖలు

Amarinder Singh: పంజాబ్ పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన వర్గం ఎమ్మెల్యేలతో చంఢిఘడ్‌లోని తన నివాసంలో భేటీ అనంతరం రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కాసేపటి క్రితమే రాజ్ భవన్‌కు చేరుకున్న కెప్టెన్ గవర్నర్‌కు రాజీనామా పత్రాలు సమర్పించారు. అమరీందర్ సింగ్‌తో పాటు మంత్రులు కూడా రాజీనామా లేఖలు గవర్నర్‌కు సమర్పించారు. మరోవైపు అమరీందర్ రాజీనామాతో పంజాబ్ కొత్త సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది.

మరోవైపు తన రాజీనామాపై అమరీందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం మూడోసారని, ఇలా చేయడాన్ని అవమాన కరంగా భావిస్తున్నానని భావోద్వేగానికి గురయ్యారు. హైకమాండ్‌కు తనపై విశ్వాసం లేనట్లుందన్న కెప్టెన్ రెండు నెలల్లో తనను మూడు సార్లు ఢిల్లీకి పిలిచారని గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో హైకమాండ్ ఎవరినైనా ముఖ్యమంత్రి చేసుకోవచ్చన్న అమరీందర్ సింగ్ భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories