పుల్వామా కేసులో తండ్రి, కూతురు అరెస్టు

పుల్వామా కేసులో తండ్రి, కూతురు అరెస్టు
x
Highlights

గత ఏడాది 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఘటన విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కీలక పురోగతి సాధించింది. పుల్వామా ఉగ్రవాద...

గత ఏడాది 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఘటన విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కీలక పురోగతి సాధించింది. పుల్వామా ఉగ్రవాద దాడిలో కీలక పాత్ర పోషించినందుకు తండ్రి, కుమార్తెలను ఎన్‌ఐఏ మంగళవారం అరెస్టు చేసింది. నిందితులకు జమ్మూలోని ప్రత్యేక న్యాయస్థానం 10 రోజుల రిమాండ్‌ విధించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన సమీర్ అహ్మద్ దార్ ముందుగా వీడియో చిత్రీకరణను దక్షిణ కాశ్మీర్‌ పుల్వామాలోని హక్రిపోరాలో రూపొందించారు.

దీంతో వారిని అరెస్ట్ చేశారు. అతడికి హక్రిపొరాకు చెందిన ట్రక్‌ డ్రైవర్‌ తౌఫిక్‌ అహ్మద్‌ షా, అతడి కూతురు ఇన్షాజాన్‌(23)లు సహకరించినట్టు గుర్తించారు. ఇన్షాజాన్‌ పాఠశాల చదువు మానేసి.. తండ్రితో కలిసి 2018–19 కాలంలో ఉగ్రవాదులకు పలుమార్లు ఆహారం, ఇతర వస్తువులను సమకూర్చినట్టు తేల్చారు.

అంతేకాదు పాకిస్తాన్‌ ఉగ్రవాది, పేలుడు పదార్థాల నిపుణుడు అయిన మొహ్మద్‌ ఉమర్‌ ఫరూక్, పాకిస్తాన్‌కే చెందిన కమ్రాన్, ఇస్మాయిల్‌ అలియాస్‌ ఇబ్రహీం, అలియాస్‌ అద్నాన్‌లు తౌఫిక్‌ ఇంట్లోనే బస చేశారు. పాకిస్తాన్ ఐఇడి తయారీ సంస్థ ఉమర్ ఫారూక్‌తో ఇన్‌షా జాన్ నిరంతరం సంప్రదింపులు జరిపిందని, టెలిఫోన్ మరియు ఇతర సోషల్ మీడియా అనువర్తనాల ద్వారా అతనితో కమ్యూనికేట్ చేసిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

కాగా నిందితుడు ఆత్మహుతి దాడిలో చనిపోయే దాకా ఈ సంబంధాలు కొనసాగాయని మా దర్యాప్తులో తేలింది'అని ఎన్‌ఐఏ తెలిపింది. వారి వద్ద ఉన్న రెండు ఫోన్‌లను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. ఆత్మాహుతి దాడి జరిగిన రోజున, జైషే తీవ్రవాది షకీర్ మాగ్రే కారును నడిపాడు, కాని దాడి జరిగిన ప్రదేశం నుండి 500 మీటర్ల దూరంలో వాహనం నుండి దిగిపోయాడని ఎన్ఐఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కాగా పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రదాడిలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతీకారణంగా వారం రోజుల్లోనే బాలాకోట్ పై దాడి చేసి దాదాపు 200 మంది ఉగ్రవాదులను ఏరివేసింది భారత్. ఈ సంఘటనతో అప్పటిదాకా గుండెమంటతో రగిలిపోతున్న భారతీయులు ప్రతీకారం తీర్చుకున్నందుకు ఆనందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories