దేశ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి పల్స్‌ పోలియో

Pulse‌ polio Vaccination  In India from today
x

Pulse‌ polio (file image)

Highlights

దేశ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి పల్స్‌ పోలియో కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ...

దేశ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి పల్స్‌ పోలియో కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే చిన్నారులకు పోలియో చుక్కలు వేయవద్దని సూచించింది. ఈ లక్షణాలు తగ్గిన తర్వాత చిన్నారులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులకు సూచించింది.

కాగా, దేశ వ్యాప్తంగా ఆదివారం ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసే శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మందు వేస్తారు. అలాగే నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. అయితే జనవరి 17 నుంచి పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జనవరి 16 నుంచి ప్రారంభం కావడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది.

తెలుగు రాష్ట్రాల్లో పల్స్‌ పోలియో కార్యక్రమానికి ఆరోగ్యశాఖలు సిద్ధమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏపిలో 52లక్షల 72వేల354 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇక తెలంగాణలోనూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఐదేళ్ల లోపు ఉన్న 38లక్షల 31వేల 907 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇక హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 5లక్షల 15వేల 520 మంది చిన్నారులకు చుక్కలు వేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories