Puja Khedkar: ఐఏఎస్ నుంచి పూజా ఖేడ్కర్ తొలగింపు

Puja Khedkar removed from IAS
x

Puja Khedkar: ఐఏఎస్ నుంచి పూజా ఖేడ్కర్ తొలగింపు

Highlights

Puja Khedkar: పూజా ఖేడ్కర్ ను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించింది కేంద్రం. ఆలిండియా సర్వీస్ రూల్స్ 1954 ప్రకారంగా ఆమెపై చర్యలు...

Puja Khedkar: పూజా ఖేడ్కర్ ను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించింది కేంద్రం. ఆలిండియా సర్వీస్ రూల్స్ 1954 ప్రకారంగా ఆమెపై చర్యలు తీసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. తక్షణమే ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయని కూడా అధికారులు తెలిపారు. పుణెలో ట్రైనీ కలెక్టర్ గా విదులు నిర్వహిస్తున్న సమయంలో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. తనకు ప్రత్యేక సదుపాయాలు కావాలని ఆమె క్షేత్రస్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆమెను బదిలీ చేసింది. ఈ ఘటన తర్వాత మరిన్ని అంశాలపై ఆమెపై ఆరోపణలు వచ్చాయి.

యుపీఎస్ సీ లో తప్పుడు సర్టిఫికెట్లను సమర్పించారని కూడా ఆమెపై ఆరోపణలు వచ్చాయి.ఈ ఆరోపణలపై యూపీఎస్ సీ విచారణ నిర్వహించింది. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని యూపీఎస్ సీ ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అంతేకాదు ఆమెపై ఫోర్జరీ కేసు కూడా నమోదు చేసింది. దీంతో అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు. అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడానికి యూపీఎస్ సీకి లేదని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీఓపీటీ ఆమెను తొలగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories