తుది దశకు అయోధ్య కేసు ... నేడు సుప్రీంకోర్టులో విచారణ

తుది దశకు అయోధ్య కేసు ... నేడు సుప్రీంకోర్టులో విచారణ
x
Highlights

అయోధ్యలోని వివాదాస్పద స్థలం రామమందిరం- బాబ్రీమసీదు సంబంధిత కేసుపై సుప్రీం కోర్టు నేడు విచారణ జరపనుంది. ఈ నేపథ్యం అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. గతంలో ఈ అంశాన్ని మధ్యవర్తిత్తం ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలి అందుకు ఓ కమిటీని కూడా నియమించింది.

అయోధ్యలోని వివాదాస్పద స్థలం రామమందిరం- బాబ్రీమసీదు సంబంధిత కేసుపై సుప్రీం కోర్టు నేడు విచారణ జరపనుంది. ఈ నేపథ్యం అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. గతంలో ఈ అంశాన్ని మధ్యవర్తిత్తం ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలి అందుకు ఓ కమిటీని కూడా నియమించింది. స్థల వివాదంపై మధ్యవర్తిత్య కమిటీ కూడా విఫలమైంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కేసు విచారణ చేపట్టింది. ఈ కేసుపై తీర్పు తుది దశకు చేరింది. ఆగస్టు నుంచి కేసును ధర్మాసం వరుసగా విచారణ చేస్తుంది.

విజయదశమి సందర్భంగా కోర్టుకు సెలవలు కావడంతో కేసు విచారణ వారం రోజులకు వాయిదా పడింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి నేతృత్వంలోని 5 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది.నేడు ఈ కేసుకు సంబంధించి ముస్లీం మత పెద్దల వాదనలు జరగనున్నాయి. ఈ నెల 16 తేదీనా హిందూ వర్గాల వాదనలు ముగించాలని కోర్టు సూచించింది. నవంబర్ 17న తీర్పువెలువరించనుంది. దీంతో సున్నితమైన అంశం కావడంతో ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా అయోధ్యలో 144 సెక్షన్ అమలు చేశారు. మరో రెండు నెలల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories