Justice Yashwant Varma: జడ్జి యశ్వంత్ వర్మ కేసులో కొత్త విషయాలు..ఇంట్లో భారీ స్థాయిలో నోట్ల కట్టలు ఉన్నాయని తేల్చిన ప్యానెల్

Justice Yashwant Varma: జడ్జి యశ్వంత్ వర్మ కేసులో కొత్త విషయాలు..ఇంట్లో భారీ స్థాయిలో నోట్ల కట్టలు ఉన్నాయని తేల్చిన ప్యానెల్
x
Highlights

Justice Yashwant Varma: ఢిల్లీ జడ్జి యశ్వంత్ వర్మ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు ఉండటం నిజమేనని ఈ కేసుపై విచారణ జరుపుతున్న ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ నిర్ధారించింది.

Justice Yashwant Varma: ఢిల్లీ జడ్జి యశ్వంత్ వర్మ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు ఉండటం నిజమేనని ఈ కేసుపై విచారణ జరుపుతున్న ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ నిర్ధారించింది. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న యశ్వంత్ వర్మ ఇంట్లో రెండు నెలల అగ్నిప్రమాదం జరిగినప్పుడు భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అయితే ఆ నోట్ల కట్టలు తనవి కాదని వర్మ చెప్పడంతో ముగ్గురు న్యాయమూర్తులున్న ఒక ప్యానెల్‌ని సుప్రీంకోర్టు కొలీజియం నియమించింది. తాజాగా వర్మ ఇంట్లో నోట్ల కట్టలు ఉండటం మాత్రం వాస్తవేమనని ప్యానెల్ వెల్లడించింది.

సరిగా రెండు నెలల క్రితం అప్పటి ఢిల్లీ జడ్జిగా ఉన్న యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడకు మంటలు ఆర్పడానికి వచ్చిన సిబ్బంది ఈ నోట్ల కట్టలను గుర్తించారు. అయితే దీనిపై వర్మ ఖండించారు. ఈ నోట్ల కట్టలు తమవి కావని, ఎవరో ఇక్కడ పెట్టి ఉంటారని అన్నారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు కొలీజియం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్యానెల్‌ ని నిర్మించింది. ఈ కేసులో అసలు ఏం జరిగిందో విచారణ చేసి సుప్రీంకోర్టుకు వివరించాలని చెప్పింది. దీనిపై విచారణ జరిపిన ప్యానెల్ తాజాగా జడ్జి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు ఉన్న సంగతి నిజమేనని తేల్చింది. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు చెప్పింది. అగ్నిప్రమాదంలో దగ్ధమైన నోట్ల కట్టలను ప్రమాదం జరిగిన తర్వాత రోజు అక్కడ నుంచి తొలగించడమే ఇందులో మొదట సాక్ష్యమని కూడా చెప్పింది. పైగా కాలిపోయిన నోట్ల చిన్న నోట్లు కాదని అలాగే అవి పెద్ద మొత్తంలో ఉన్నాయని ప్యానెల్ వెల్లడించింది. దీంతో పాటు అసలు ఇంత డబ్బును స్టోర్ రూమ్ లో ఎందుకు దాచారు అన్న కోణంలో మరింత విచారణ జరుపుతున్నట్లు కూడా చెప్పింది.

ఇదిలా ఉంటే ప్రమాదం జరిగే సమయానికి ఢిల్లీ హైకోర్డు జడ్జిగా ఉన్న యశ్వంత్ వర్మను సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు జస్టిస్‌గా నియమించింది. అయితే ఇప్పుడు ఈ సాక్ష్యాలు దొరకడంతో వర్మను ఇక విధుల నుంచి తొలగిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories