ఉత్తరప్రదేశ్ పోలీసులపై ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు

ఉత్తరప్రదేశ్ పోలీసులపై ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు
x
priyanka Gandhi
Highlights

ఉత్తరప్రదేశ్ పోలీసులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీవాద్ర సంచలన ఆరోపణలు చేశారు.

ఉత్తరప్రదేశ్ పోలీసులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీవాద్ర సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా లక్నోలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ హాజరయిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం తర్వాత సీఏఏ, ఎన్ఆర్‌సీలపై ఆందోళనలో గాయపడ్డవారిని పరామర్శించడానికి ప్రియాంక బయలుదేరారు. ఆమె ప్రర్యటించడానికి వీళ్లేదంటూ అక్కడి పోలీసులు రోడ్డుపైనే అ‍డ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు తనపై చేయి చేసుకున్నారని ప్రియాంక ఆరోపించారు. పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కొందరూ పోలీసులు తన మెడ పట్టి పక్కకు నెట్టేశారని. ప్రతిఘటించిన తనమీద దాడి కూడా చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ వాద్ర కాంగ్రెస్ కార్యకర్తలను కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్నాను. దారిలో పోలీసుల వాహనం ఒకటి మా వెనక వచ్చింది. మీరు ఎక్కడికి వెళ్లడానికి విళ్లేదని అడ్డుకున్నారు. ఎందుకు వెళ్లకూడదని నేను ప్రశ్నించగా..దీంతో వారు నాపై దౌర్జన్యం చేసి తోసేశారని ప్రియాంక గాంధీ చెప్పారు.

కాగా.. పౌరసత్వ సవరణ చట్టంపై డిసెంబర్ 20న ఉత్తర్ ప్రదేశ్‌లో నిరసనలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. పోలీసులపై అల్లరిమూకలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసుల కాల్పులకు ఆందోళనకారులు కూడా మరణించారు. ఆందోళన కారుల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంక, రాహుల్ గాంధీ వెళ్లి పరామర్శించారు. అయితే ఆందోళనల కారులపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ విమర్శలు ఎదుర్కొంటోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories