మోదీపై పోటీకి.. ప్రియాంక గాంధీ సిద్ధమవుతున్నారా?

ప్రధాని మోదీపై పోటీకి.. ప్రియాంక గాంధీ సిద్ధమవుతున్నారా? అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆమె భర్త...
ప్రధాని మోదీపై పోటీకి.. ప్రియాంక గాంధీ సిద్ధమవుతున్నారా? అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆమె భర్త రాబర్ట్ వాద్రా.. ప్రియాంక వాద్రా వారణాసి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కాగా ప్రధాని మోదీ కూడా వారణాసి నుంచే పోటీ చేస్తున్నారు. అయితే ప్రధానిపై ప్రియాంక పోటీకి పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
గతంలోనే పార్టీ బాధ్యతలు స్వీకరించే సమయంలో పార్టీ ఆదేశిస్తే వారణాసి నుంచి పోటీకి సిద్ధమని ప్రియాంక ప్రకటించారు. ఇప్పటికే ఆమె అలహాబాద్, ప్రయాగ్ రాజ్ నుంచి వారణాసి వరకు.. ఆమె గంగా యాత్ర నిర్వహించారు. జనవరిలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, తూర్పు ఉత్తరప్రదేశ్ ఇంఛార్జ్ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ ప్రచారంలో దూకుడు చూపించారు. ఇప్పుడు నేరుగా మోదీతో పోటీకి సై అంటున్నారు. కాగా ప్రియాంక నిర్ణయాన్ని కొందరు సీనియర్ నేతలు తప్పుబడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానిపై పోటీ అంటే ఓ సారి ఆలోచించుకోవాలి.. పైగా ఆయన అధికారంలో ఉన్నారు అని వారిస్తున్నారట.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMT