కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
x
Highlights

ఢిల్లీలో పెరుగుతున్న కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పెద్ద ఎత్తున ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఢిల్లీలో పెరుగుతున్న కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పెద్ద ఎత్తున ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ నగరంలోని మొత్తం 79 కంటైనర్ జోన్లలో మూడు, నాలుగు రోజులలో 40,000 ర్యాపిడ్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం మొబైల్ ల్యాబ్స్ గా 25 ఖైదీల వ్యాన్లను ఉపయోగించాలని ఢిల్లీ ప్రభుత్వం సోమవారం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

కాగా శనివారం కరోనా బారిన పడిన 186 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే వీరికి ఎవ్వరికి లక్షణాలు లెవ్వు.. దాంతో వీరికి ఎలా సోకిందనే దానిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.. ఇది తెలియకుండానే ఇతరులకు సోకుతుందనే అనుమానాలకు బలం చేకూరడంతో.. ఏపీ ప్రభుత్వం తరహాలో ర్యాపిడ్ పరీక్షలు అవసరమని ఢిల్లీ ప్రభుత్వం గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories