కరొనాపై పోరు: విరాళాలివ్వాలని ప్రధాని పిలుపు

కరొనాపై పోరు: విరాళాలివ్వాలని ప్రధాని పిలుపు
x
Highlights

దేశ‌వాప్తంగా క‌రోనా కేసులు సంఖ్య పెరిగిపోతుంది. ఇప్ప‌టికే దేశంలో 9వంద‌ల‌పైగా కేసులు న‌మోద‌య్యాయి.

దేశ‌వాప్తంగా క‌రోనా కేసులు సంఖ్య పెరిగిపోతుంది. ఇప్ప‌టికే దేశంలో 9వంద‌ల‌పైగా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మహమ్మారిపై పోరాటం చేయాల‌ని దేశ ప్ర‌జ‌ల‌క చేయూతనివ్వాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభ్య‌ర్థించారు. కోవిడ్ కట్టడికి నిధులు సేకరణ కోసం పీఎం-కేర్స్‌ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి పౌర సహాయ, ఉపశమన అత్యవసర పరిస్థితుల నిధి విరాళాలు అందించాలని కోరారు. కోవిడ్‌-19పై పోరాటానికి అండగా నిలబడాలనిబ‌ఈ నిధిని ఆరోగ్యకర దేశాన్ని తయారు చేసేందుకు వినియోగిస్తామని మోదీ వెల్ల‌డించారు.

ప్రధానమంత్రి పౌర సహాయ, ఉపశమన అత్యవసర పరిస్థితుల నిధి( పీఎం-కేర్స్‌) ట్రస్ట్‌కు ప్రధానమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారని కేంద్ర సమాచార శాఖ స్ప‌ష్టం చేసింది. ట్రస్ట్‌ సభ్యుల్లో హోం మంత్రితో పాటు, రక్షణ, ఆర్థిక శాఖ‌ మంత్రులు ఉంటారని పేర్కోంది. విరాళాలు అందించే దాతలు కింద ఉన్న వివరాలకు ఇవ్వాల్సిందిగా కోరింది. విపత్కర పరిస్థితులను ఎదుర్కొవడానికి కూడా ఈ నిధిని ఉపయోగిస్తామన్నారు. తక్కువ విరాళాలను కూడా తీసుకుంటామని వెల్లడించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories