నేడు, రేపు ప్రధాని వీడియో కాన్ఫ్ రెన్స్.. కరోనా వ్యాప్తిపై సీఎంలతో చర్చ

నేడు, రేపు ప్రధాని వీడియో కాన్ఫ్ రెన్స్.. కరోనా వ్యాప్తిపై సీఎంలతో చర్చ
x
PM Modi Video Conference (File Photo)
Highlights

లాక్ డౌన్ తొలగించిన నేపథ్యంలో కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పాటు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో ...

లాక్ డౌన్ తొలగించిన నేపథ్యంలో కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పాటు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ఏ విధంగా ముందుకు వెళితే బావుంటుందనే దానిపై చర్చ జరగనుంది. దీనికి ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏర్పాట్లు చేసుకున్నారు.

నేడు, రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కాన్ఫరెన్స్ సమావేశం ప్రారంభం కానుంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు రోజుల పాటు చర్చించనున్నారు. కాగా మంగళవారం జరిగే ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అధికారులతో మాట్లాడతారు మోదీ. పంజాబ్, గోవా, కేరళ, ఝార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల సీఎంలు, ఇతర కేంద్ర పాలిత ప్రాంత అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

ఇక బుధవారం జరగబోయే వీడియో కాన్ఫరెన్స్‌లో 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమావేశం కానున్నారు మోదీ. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు వైరస్ ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్ర, బెంగాల్, ఢిల్లీ, కర్నాటక, గుజరాత్, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై చర్చించనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories