ప్రధాని మోడీని ఫిదా చేసిన చిన్నారుల వీడియో!

ప్రధాని మోడీని ఫిదా చేసిన చిన్నారుల వీడియో!
x
Social Distance Video
Highlights

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా నియంత్రణకి కేంద్రం ముందుగా 21 రోజుల లాక్ డౌన్ విధించినప్పటికీ కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా నియంత్రణకి కేంద్రం ముందుగా 21 రోజుల లాక్ డౌన్ విధించినప్పటికీ కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు..దీనితో కేంద్రం మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12,759 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో 420 మంది చనిపోయారు. ఇక గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 829 కరోనా కేసులు నమోదు కాగా, 28 మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే కరోనా కట్టడికి వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యమని, మోఖలకి మాస్కులు కట్టుకోవాలని, సోష‌ల్ డిస్టెన్స్ పాటించాలని, చేతుల‌ను శానిటైజ‌ర్‌తో శుభ్రప‌ర్చుకోవాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినీ నటులు వెల్లడించారు. అయినప్పటికీ కొందరు సోష‌ల్ డిస్టెన్స్ పాటించకుండా ఉండడం, మాస్క్ లు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

కానీ తాజాగా కొంతమంది చిన్నారులు సోష‌ల్ డిస్టెన్స్‌పై రూపొందించిన వీడియో ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీని ఆక‌ర్షించింది. ఈ వీడియోని త‌న ట్విట్టర్ అకౌంట్‌లో దీని గురించి పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆ చిన్నారులు కొన్ని ఇటుల‌కు సర్పిలాకారంలో అమ‌ర్చారు. ఒక ఇటుక‌ను మ‌రో ఇటుక‌పైకి తోస్తే, అది క్రమంగా అన్ని ఇటుక‌ల‌ను కింద ప‌డేలా చేస్తుంద‌ని ఈ వీడియోలో వివరించడం జరిగింది. అలా కాకుండా మ‌ధ్యలో ఇటుక‌ల మ‌ధ్య దూరాన్ని పెంచ‌డం ద్వారా ఈ ప్రమాదాన్ని అరిక‌ట్ట వ‌చ్చని ఆ చిన్నారులు వెల్లడించారు.

ఈ వీడియో ప్రధాని మోడీని ఎంతగానో ఆకట్టుకుకంది. ఈ వీడియోని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. సింపుల్ వీడియో ద్వారా పిల్లలు సామాజిక దూరాన్ని చ‌క్కగా వివ‌రించారని ప్రధాని కొనియాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది!



Show Full Article
Print Article
More On
Next Story
More Stories