రైతులకు శుభవార్త.. మరో కీలక పథకాన్ని ప్రవేశపెట్టిన మోదీ..

రైతులకు శుభవార్త.. మరో కీలక పథకాన్ని ప్రవేశపెట్టిన మోదీ..
x
Narendra Modi (File Photo)
Highlights

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో కీలక పథకం ప్రవేశపెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో శనివారం కిసాన్ సమ్మెలన్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 10,000 కొత్త రైతు ఉత్పత్తి సంస్థలను (ఎఫ్‌పిఓ) ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో కీలక పథకం ప్రవేశపెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో శనివారం కిసాన్ సమ్మెలన్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 10,000 కొత్త రైతు ఉత్పత్తి సంస్థలను (ఎఫ్‌పిఓ) ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని కిసాన్ సమ్మన్ నిధి పథకం మొదటి వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ, రైతుల ఆదాయాన్ని పెంచడానికి కొత్త ఎఫ్‌పిఓను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రూ.5,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

దీనివల్ల రైతులకు పంటలను ఉత్పత్తి చేయడంతో పాటు వాటిని మార్కెట్ చేసి ప్రాసెస్ చేయవచ్చు. దేశంలో చిన్న, సన్నకారు రైతుల సంఖ్యే ఎక్కువ. మొత్తం రైతుల్లో వీరి సంఖ్య 86 శాతం వరకు ఉంటుంది. వీరంతా, సరైన గిట్టుబాటు ధర లేక, నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు లభించక, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు సరిగా జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ అవసరమైన ఆర్థిక సాయం అందించడానికి FPOలు పనిచేయనున్నాయి.

అలాగే పిఎం-కిసాన్‌కు చెందిన 10 మంది లబ్ధిదారుల రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను (కెసిసి) పంపిణీ చేశారు. పిఎం-కిసాన్ లబ్ధిదారులందరికీ కెసిసి సౌకర్యాలు కల్పించాలన్న ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా 28 వేల బ్యాంకుల శాఖల నుంచి కెసిసిలను శనివారం పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాకు తెలిపారు.

అంతేకాదు వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ భారీ కార్యక్రమం అరుదైన రికార్డులకు వేదికగా నిలిచింది. ఒకే ప్రదేశంలో అధిక సంఖ్యలో ప్రత్యేక ఉపకరణాలు పంపిణీ చేయడం, చక్రాల కుర్చీలతో అత్యంత పొడవైన వరుసను ఏర్పాటు చేయడం సహా 5 అంశాల్లో గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ పర్యటనలో మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ 4 లైన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాగా ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories