Narendra Modi: ఇవాళ సీఎంలతో ప్రధాని మోడీ వర్చువల్ భేటీ

Narendra Modi: కొవిడ్, ఒమిక్రాన్ పరిస్థితులపై చర్చ.. భారీగా పెరుగుతున్న రోజువారీ కేసులు

Rama Rao
Updated on: 13 Jan 2022 9:30 AM IST
Prime Minister Narendra Modi Virtual Meeting with the CMs Today
X

ఇవాళ సీఎంలతో ప్రధాని మోడీ వర్చువల్ భేటీ

Narendra Modi: భారత్ లో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కరోనా పరిస్థితులపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ఇవాళ వర్చువల్‌గా భేటీ కానున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు భేటీ జరగనుంది. ఇక రోజువారీ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కరోనా కట్టడికి ఎటువంటి సూచనలు చేస్తారనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ సూచించనున్నారు. అలాగే ఆర్ధిక పరిస్థితిపైనా ప్రధాని చర్చించనున్నట్టు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story