మన్​కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ

మన్​కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ
x
Highlights

* కొత్త సంవత్సరంలో దేశం సమున్నత శిఖరాలను అధిరోహిస్తుంది: మోడీ * కరోనా సంక్షోభ పరిస్థితులు అనేక పాఠాలు నేర్పించాయని వెల్లడి * ఆర్థిక వేత్తలు కూడా అంచనా వేయలేని పరిస్థితులు తలెత్తాయి: మోడీ

ఈ ఏడాది చివరి మన్​కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ... విశాఖపట్నానికి చెందిన వెంకట మురళి గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. మురళి రూపొందించిన ఏబీసీ ఛార్ట్ గురించి వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ ఛార్ట్‌లో అనేక విషయాలను వెంకట మురళి పొందుపరిచినట్లు నరేంద్ర మోడీ తెలిపారు.కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి ఛార్ట్ చేస్తారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

నూతన సంవత్సరంలో భారత్ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తుందని మోడీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా గొలుసు సరఫరా వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఆర్థికవేత్తలు కూడా అంచనా వేయలేని పరిస్థితులు వచ్చాయన్నారు. కరోనా సంక్షోభ పరిస్థితులు మనకు కొత్త పాఠాలు నేర్పించాయని తెలిపారు. ఈ కాలంలో భారత్‌ మరిన్ని సామర్థ్యాలు పెంపొందించుకుందని తెలిపారు. దేశ ప్రజల ఆలోచనల్లోనూ ఈ ఏడాది భారీ మార్పులు వచ్చాయని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories