'అంఫన్‌' పై మోదీ అత్యవసర సమావేశం

అంఫన్‌ పై మోదీ అత్యవసర సమావేశం
x
Highlights

'అంఫన్‌' తుఫాను నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు.

'అంఫన్‌' తుఫాను నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ, ఎన్‌డీఎంఏ అధికారులు ప్రధాని నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా తుపాను ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. 'ఆంఫన్ తుపానును ఎలా ఎదుర్కోవాలా? అనే విషయంపై ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కాగా అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. తుఫాను విషయంలో ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటుందని హామీ ఇస్తున్నా' అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

కాగా అంఫన్ తుఫాను చాలా తీవ్రమైన తుఫాను, ఇది దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగంపై ఏర్పడింది. క్రమంగా ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని అనంతరం 'సూపర్ తుఫాను'గా తీవ్రతరం అవుతుందని IMD హెచ్చరించింది. సోమవారం సాయంత్రం తుఫాను ' అమ్ఫాన్ ' సూపర్ తుఫానుగా తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని, ఇది ఈ నెల 20వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని డిగా, బంగ్లాదేశ్‌లో ఉన్న హతియా ఐల్యాండ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories