జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ

జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ
x
Highlights

కేంద్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ బడ్జెట్ ద్వారా...

కేంద్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ బడ్జెట్ ద్వారా యువతలో నైపుణ్యాల అభివృద్ధి అవకాశాల కల్పనకు పెద్దపీట వేశామని వివరించారు. రైతుల ఆదాయం రెట్టింపుకై, ఆధునిక భారత నిర్మాణానికి కావాల్సిన నైపుణ్యాలపై దృష్టి పెట్టామని, విదేశాలకు వెళ్లేవారి కోసం బ్రిడ్జ్ కోర్సులు, ఆన్ లైన్ కోర్సులు, ఇంటర్న్ షిప్ విధానాలు అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. బడ్జెట్ లో స్మార్ట్ సిటీలు, డేటా సెంటర్ పార్కులు వంటి అనేక అంశాలకు చోటిచ్చామని తెలిపారు.

భారత్‌లో వైద్య పరికరాల తయారీకి ఎన్నో అవకాశాలున్నాయని, వాటి వినియోగానికి తోడ్పడే బడ్జెట్ రూపొందించామని చెప్పారు. దేశ ఆరోగ్య రంగానికి ఆయుష్మాన్ భారత్ కొత్త దశను నిర్దేశిస్తుందని అన్నారు. ఆక్వా విప్లవంతో మత్స్యపరిశ్రమలో విస్తృత అవకాశాలకు వీలవుతందని పేర్కొన్నారు. యువకు ఉపాధి, పరిశ్రమల్లో పెట్టుబడులకు అవకాశాలను బడ్జెట్ ప్రతిబింబిస్తోందని ప్రధాని వెల్లడించారు. దేశం నుంచి ఎగుమతులు పెంచేందుకు బడ్జెట్ లో తగిన ప్రోత్సాహకాలు ప్రకటించామని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories