Modi: ఈ నెల 21న హిరోషిమాకు ప్రధాని మోడీ

Prime Minister Modi will visit Hiroshima on 21st of this Month
x

Modi: ఈ నెల 21న హిరోషిమాకు ప్రధాని మోడీ

Highlights

Modi: పసిఫిక్‌ దీవుల ఫోరమ్‌ సదస్సులో పాల్గొననున్న మోడీ, బైడెన్

Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వచ్చే వారంలో కొన్ని కీలక కూటమి సమావేశాల్లో పాల్గొననున్నారు. జీ-7 సదస్సుకు ఆతిథ్యమిస్తున్న జపాన్‌.. 8 దేశాలకు ఆహ్వానం పంపింది. ఇందులో భారత్‌ కూడా ఉంది. ఈ సదస్సులో పాల్గొనడానికి మోడీ ఈ నెల 21న హిరోషిమా బయల్దేరనున్నారు. బైడెన్‌ కూడా హాజరవుతారు. 22న పపువా న్యూగినియాలో పసిఫిక్‌ దీవుల ఫోరమ్‌ సదస్సులోనూ మోడీ పాల్గొంటారు. ఇక్కడా అగ్రరాజ్యాధినేతతో ప్రధాని భేటీ కానున్నారు.

24న క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిస్తున్న ఆస్ట్రేలియాలో అడుగుపెడతారు. భారత్‌ సహా కూటమి సభ్యదేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు ఈ కీలక సదస్సులో ఇండో-పసిఫిక్‌లో చైనా దూకుడు, ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు.. తదితర అంశాలపై చర్చించనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories