logo
జాతీయం

PM Modi: జర్మనీలో ప్రధాని మోడీ పర్యటన

Prime Minister Modi Visit to Germany
X

PM Modi: జర్మనీలో ప్రధాని మోడీ పర్యటన

Highlights

PM Modi: మోడీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం

PM Modi: ప్రధాని మోడీ జర్మనీలో పర్యటిస్తున్నారు. జర్మనీలోని మ్యునిచ్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. కాసేపు అక్కడ పిల్లలతో మోడీ మాట్లాడారు. ఇక జర్మనీలో జరిగే జీ7 సదస్సులో మోడీ పాల్గొంటారు. ఈ సదస్సు ఇవాళ, రేపు జరగనుంది. ఈ సదస్సులో భారత్, జర్మనీతోపాటు అర్జెంటీనా, సెనెగల్, ఇండోనేషియా, దక్షిణఫ్రికా దేశాలు పాల్గొనబోతున్నాయి. జీ 7 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు.

వాతావరణం, విద్యుత్, ఆహార భద్రత, ఆరోగ్యం, ఉగ్రవాదం, ప్రజాస్వామ్యం అంశాలపై జీ7 సదస్సులో చర్చించనున్నారు. అనంతరం మ్యునిచ్‌లో భారతీయులతో ఏర్పాటు చేసిన ఒక సభలో మోడీ ప్రసంగిస్తారు. జర్మనీలో రెండు రోజుల సదస్సుకు హాజరైన తర్వాత 28న ప్రధాని UAEకి వెళ్తారు. అక్కడ ఇటీవల మరణించిన మాజీ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయేద్‌ మృతికి సంతాపం ప్రకటించి, నివాళులు అర్పిస్తారు.

Web TitlePrime Minister Modi Visit to Germany
Next Story