వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Prime Minister Modi to launch corona vaccination
x

Prime Minister (File Image)

Highlights

* ఎల్లుండి నుంచే కరోనా వ్యాక్సిన్ పంపిణీ * దేశవ్యాప్తంగా 3 వేల కేంద్రాల్లో వ్యాక్సినేషన్ * తొలిరోజు ఒక్కో కేంద్రంలో కనీసం 100 మందికి వ్యాక్సిన్

యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. జనవరి 16 ఉదయం పదిన్నర గంటలకు ప్రధాని మోడీ కరోనా టీకా డ్రైవ్‌ను ప్రారంభించనున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలను భాగస్వామ్యం చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌గా ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం తొలిరోజు 3 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు అందించనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 3 వేల కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ నిర్వహించనున్నారు.

మరోవైపు తొలిరోజు ప్రతి కేంద్రంలో కనీసం 100 మందికి ఇవ్వాలని నిర్ణయించారు. తదుపరి దశల్లో వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను 5 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. అలాగే తొలిదశలో 30 మిలియన్ల హెల్త్ వర్కర్లకు, ఇతర ముందు వరుస యోధులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తర్వాత దశలో 50 ఏళ్లకు పైబడిన 270 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందిస్తారు. కరోనా బారిన పడేందుకు అత్యధిక అవకాశాలు ఉన్న 300 మిలియన్ల మందికి రాబోయే కొన్నినెలల్లో టీకా వేయనున్నారు. ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకా డోసులు పెద్ద సంఖ్యలో పంపిణీ కేంద్రాలకు చేరుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories