PM Modi: కరోనాపై దేశం పెద్ద యుద్ధమే చేస్తోంది -ప్రధాని మోడీ

Prime Minister Modi Speech On Coronavirus Expanding in India
x

పీఎం మోడీ (ఫైల్ ఇమేజ్)

Highlights

PM Modi: తుపానులా కరోనా రెండో దశ-మోడీ * లాక్‌డౌన్‌ రానివ్వొద్దు-ప్రధాని మోడీ

PM Modi: కరోనాపై దేశం పెద్ద యుద్ధమే చేస్తోందన్నారు ప్రధాని మోడీ. తుపానులా రెండో దశ విరుచుకుపడుతోందన్నారు ఆయన. కోవిడ్‌ మహమ్మారిని సంకల్పం, ధైర్యం సన్నద్ధతతో అధిగమించాలన్నారు ప్రధాని మోడీ.

కరోనా నుంచి కోలుకుని దేశం స్థిమితపడుతున్న సమయంలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తుఫానులా వచ్చిందన్నారు ప్రధాని మోడీ. సెకండ్ వేవ్‌ విజృంభిస్తున్నప్పటికీ మనమంతా సమిష్టగా పోరాడాలన్నారు ఆయన. ఇక మహమ్మారిని ఎదుర్కొనేందుకు స్వీయ క్రమశిక్షణ అత్యవసరమన్నారు.

ఇక యువత కమిటీలుగా ఏర్పడి చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు ప్రధాని మోడీ. అలా చేస్తే కంటెయిన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటుచేయడం, లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ విధించడం వంటి పరిస్థితులు ప్రభుత్వాలకు రానేరావన్నారు.

కరోనా నుంచి రక్షించుకోవడానికి అన్ని నియమాలనూ వందశాతం పాటించాలన్నారు ప్రధాని మోడీ. ప్రస్తుతం రంజాన్‌ స్ఫూర్తితో నియమపాలను కట్టుబడి ఉందమన్నారు. అదే ధైర్యం, ఆత్మసంయమనం, నియమపాలనను నేర్పిస్తుందన్నారు. ఇక కరోనాపై యుద్ధంలో విజయం సాధించడానికి నియమపాలన చాలా ముఖ్యమన్నారు మోదీ

ఇక ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అన్నార్తులను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు మోడీ. అదేవి ధంగా వలస కార్మికులు ఎక్కడి వారక్కడే ఉండాలని వారి జీవనోపాధిపై ఎలాంటి ప్రభావం పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories