INS Vikrant: INS విక్రాంత్ ని ప్రారంభించిన ప్రధాని మోడీ

Prime Minister Modi Launched INS Vikrant
x

INS Vikrant: INS విక్రాంత్ ని ప్రారంభించిన ప్రధాని మోడీ

Highlights

INS Vikrant: INS విక్రాంత్ రూపకల్పనతో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్

PM Modi: రక్షణ రంగంలో ఎన్నో ఘనతలు సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత్‌.. మరో మైలురాయిని అందుకుంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తొలి విమాన వాహక యుద్ధనౌక INS -విక్రాంత్ ప్రధాని మోడీ చేతుల మీదుగా లాంఛనంగా నౌకాదళంలో చేరింది. కేరళ తీరంలో ఇవాళ నవశకం ప్రారంభమైందని ప్రధాని మోడీ అన్నారు. అమృతోత్సవ వేళ INS ప్రవేశం శుభపరిమాణమని, INS విక్రాంత్ చూసి ప్రతి భారతీయుడు గర్వపడాలని ప్రధాని మోడీ అన్నారు. భారత్ తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని మోడీ స్పష్టం చేశారు.

బాహుబలి యుద్ధనౌకగా పేరుగాంచిన.. INS విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్ర జలాల్లో భారత తీర ప్రాంతం మరింత దుర్బేధ్యం కానుంది. INS విక్రాంత్ 262 మీటర్ల పొడవు, 62 వెడల్పు ఉంటుంది. గంటకు గరిష్ఠంగా 28 నాటికల్‌ మైళ్ళ వేగంతో ఈ నౌక ప్రయాణిస్తుంది. దీనిపై 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను పెట్టి తీసుకెళ్ళవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories