PM Modi: ఒలింపిక్‌ విజేతలను అభినందించిన ప్రధాని మోడీ

PM Modi: మోడీకి బ్యాడ్మింటన్‌ రాకెట్‌ను బహుమతిగా ఇచ్చిన సింధు * ఒలింపిక్‌ హీరోలతో ముచ్చటించిన ప్రధాని మోడీ

Sandeep Eggoju
Published on: 18 Aug 2021 2:15 PM IST
Prime Minister Modi Congratulates Olympic Medal Winners
X

ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన వారిని అభినందించిన మోడీ (ఫైల్ ఇమేజ్)

PM Modi: విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన ఒలింపిక్స్ పతక వీరులకు ప్రధాని మోడీ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. ఢిల్లీలోని తన నివాసానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించిన మోడీ అథ్లెట్ల కృషిని కొనియాడారు ఈ సందర్భంగా క్రీడాకారులు తమ ఆట వస్తువులను మోడీకి అందించారు. స్టార్ షట్లర్ పీవీ సింధుతో ఒలింపిక్స్‌కు బయల్దేరే ముందు ఇచ్చిన మాటను ప్రధాని నిలబెట్టుకున్నారు. ఆమెతో కలిసి ఐస్ క్రీం తిన్నారు. స్వర్ణ పతక విజేత నీరజ్‌కు చుర్మా రుచి చూపించారు. తన ఇంటికి వచ్చిన క్రీడాకారులందరినీ ఆయన పేరుపేరునా పలకించారు.. వారిలో కలిసి చాలాసేపు ముచ్చటించారు.. ఒలింపిక్స్ విజేతలను ప్రధాని అభినందించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story