India: దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమావేశం

Prime Minister meets with the CMs of the Southern States
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

India: అమిత్‌షా అధ్యక్షతన మార్చి 4న తిరుపతిలో సమావేశం * రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న అంశాలపై చర్చ

India: దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడి సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు చెక్ పడనుందా? ఏపీ పునర్విభజన చట్టానికి భిన్నంగా ప్రాజెక్టులు చేపట్టినట్లు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం సద్దుమనిగేనా..? ప్రధానమంత్రి హామీ ఇచ్చిన ప్రాజెక్టుల గురించి ఈ సమావేశంలో చర్చకు రానుందా..? వాచ్ దిస్ స్టోరీ.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. మార్చి నాలుగున తిరుపతిలో జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న అంశాలపై చర్చలు జరుగుతాయి. సాగునీటి రంగానికి సంబంధించి నాలుగైదు ప్రాజెక్టులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన గుండ్రేవుల, రాయలసీమ ఎత్తిపోతలతో సహా తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల గురించి చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

పునర్విభజన తర్వాత 90 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి, 30 టీఎంసీలతో డిండి ఎత్తిపోతల పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని, వీటి ప్రభావం దిగువన ఉన్న ప్రాజెక్టులపై ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ ఫిర్యాదు చేసింది. కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా ఈ ప్రాజెక్టులపై ముందుకెళ్లనీయవద్దని ఆంధ్రప్రదేశ్‌ కోరుతుండగా, ఈ రెండు ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించినవి తప్ప కొత్తవి కాదని తెలంగాణ పేర్కొంది. ఈ నేపథ్యంలో మళ్లీ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చకు రానుంది.

గోదావరి-కావేరి అనుసంధానంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నవి. గోదావరిపై జానంపేట వద్ద నీటిని మళ్లించే ప్రతిపాదన వల్ల తెలంగాణకు 39.05 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 107.71 టీఎంసీలు, తమిళనాడుకు 83.23 టీఎంసీలు లభ్యమవుతాయి. ఇచ్చంపల్లి నుంచి కావేరి వరకు అనుసంధానం వల్ల తెలంగాణకు 65.79 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 80.69 టీఎంసీలు, తమిళనాడుకు 83.27 టీఎంసీలు లభ్యవవుతాయని జాతీయ జల అభివృద్ధి సంస్థ ఇప్పటికే పేర్కొంది. దీనిపై 2019 నాటి సమావేశంలో చర్చ జరగింది. మళ్లీ ఇప్పుడూ జరిగే అవకాశాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చినప్పటికీ కేంద్రం నుంచి వచ్చే నిధులపై సందిగ్ధం ఏర్పడింది. దీనపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళకు చెందిన అంశాలపై కూడా చర్చ జరగనుంది.

దక్షిణాది రాష్ట్రల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొంటారా లేదా అని క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో ఇరు రాష్ట్రల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన విధంగా గోదావరి కృష్ణ అనుసంధానంపై మరో సారి చర్చిస్తారా అనేది వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories