
2020 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురష్కరించుకొని.. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2019 సంవత్సరానికి గాను మహిళా సాధకులకు 'నారి శక్తి పురష్కార్' ను సమర్పించారు.
2020 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురష్కరించుకొని.. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2019 సంవత్సరానికి గాను మహిళా సాధకులకు 'నారి శక్తి పురష్కార్' ను సమర్పించారు. ఈ అవార్డును అందుకున్న ఏడుగురు మహిళల్లో భారత వైమానిక దళాల తొలి మహిళా ఫైటర్ పైలట్లు - మోహనా జితార్వాల్, అవని చతుర్వేది, భవన కాంత్ ఉన్నారు.
ముగ్గురు మహిళా పైలట్లు 2018 లో మొదటిసారిగా MIG-21 ఫ్లైట్ ను సోలోగా డ్రైవ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. "మేము మా దేశానికి సేవ చేయడానికి ఉన్నాము.. మేము సాధించాల్సింది చాలా ఉంది" అని IAF మహిళలు చెప్పారు.
♦ చరిత్ర సృష్టించిన 'మిరాకిల్ ఫ్రమ్ చండీగడ్ '10 ఏళ్ల మన్ కౌర్ - అథ్లెటిక్స్లో సాధించిన విజయాలకు రాష్ట్రపతి నుండి ప్రతిష్టాత్మక అవార్డును కూడా అందుకున్నారు. ఆమె ప్రపంచవ్యాప్తంగా ట్రాక్ మరియు ఫీల్డ్ ఈవెంట్లలో 30 పతకాలు సాధించారు.
♦ తెలంగాణకు చెందిన పడాలా భూదేవికి కూడా నారి శక్తి పురష్కారం ప్రధానం చేశారు. 1996 లో స్థాపించబడిన కమ్యూనిటీ-ఆధారిత సంస్థ- CAVS (చిన్నై అధివాసి వికాస్ సొసైటీ) ద్వారా గిరిజన మహిళలు, వితంతువుల అభివృద్ధి కోసం ఆమె కృషి చేస్తోంది.
♦ భారతదేశంలో ఆటోమొబైల్ టెక్నాలజీల అభివృద్ధికి కృషి చేసిన రష్మి ఉర్ధ్వర్ధేకు కూడా రాష్ట్రపతి అవార్డు ప్రధానం చేశారు. దేశంలో ఆటోమొబైల్ టెక్నాలజీస్ ప్రాజెక్టులలో మరింత వృద్ధి సాధించేందుకు వీలుగా మిచెలిన్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆమె సహకరించారు.
♦ జమ్మూ కాశ్మీర్ సంస్కృతి మరియు వారసత్వాన్ని పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలకు గాను శ్రీనగర్ కు చెందిన అర్ఫా జాన్ కు కూడా 'నారి శక్తి పురష్కార్' లభించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. "నా తండ్రి మరియు భర్త మద్దతుతో, నేను సంప్రదాయవాద సమాజంతో పోరాడగలిగాను అని ఆమె అన్నారు.
♦ మహిళా సాధికారతకు చేసిన కృషికి ఫలితంగా తొంభై ఆరేళ్ల కార్తియాని అమ్మ , 105 ఏళ్ల భగీరతి అమ్మ లకు సంయుక్తంగా 'నారి శక్తి పురష్కార్' అవార్డును ప్రదానం చేశారు రాష్ట్రపతి. అక్షరాస్యత కార్యక్రమాల్లో భాగం కావాలని కోరుకునే వేలాది మందికి వీరు రోల్ మోడల్‌గా నిలిచారు.
♦ కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ అథారిటీ కార్యక్రమం అయిన "అక్షలక్షం" లో కార్తియాని అమ్మ 2018 లో 98/100 మార్కులు సాధించారు. అలాగే భగీరతి అమ్మ కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ యొక్క నాల్గవ ప్రామాణిక సమానత్వ పరీక్షను క్లియర్ చేశారు.
♦ జార్ఖండ్‌కు చెందిన 'లేడీ టార్జాన్' గా పిలువబడే పర్యావరణవేత్త చామి ముర్ము అటవీ శాఖతో కలిసి 25 లక్షలకు పైగా చెట్లను విజయవంతంగా నాటారు.. మరియు స్థానిక వన్యప్రాణుల రక్షణకు చురుకుగా కృషి చేశారు. ఆమెకు కూడా అవార్డు వచ్చింది.
♦ "పాన్ ఇండియా స్థాయిలో లడఖీ వంటకాలను సూచించే రెస్టారెంట్" నిల్జా వాంగ్మోకు 'నారి శక్తి పురష్కార్' ప్రదానం చేశారు. లడఖిలో సాంప్రదాయ వంటకాలను అందించే మొద ఆమె రెస్టారెంట్ ఆమెదే.
♦ పుట్టగొడుగుల సాగులో ప్రాచుర్యం పొందినందుకు గాను బీహార్ కు చెందిన బినా దేవికి కూడా పురష్కారం లభించింది. ఆమెను 'మష్రూమ్ విమెన్' అని పిలుస్తారు. ఆమె ఐదేళ్లపాటు టెటియాంబంబర్ బ్లాక్‌లోని ధౌరి పంచాయతీకి సర్పంచ్ గా వ్యవహరించారు కూడా.
♦ ఇక బహిరంగ మలవిసర్జన వలన కలిగే అనారోగ్యాలకు సంబంధించి అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకున్నందుకు గాను కలావతి దేవికి కూడా అవార్డు లభించింది. కాన్పూర్‌లో బహిరంగ మలవిసర్జనను తగ్గించేందుకు చేసిన ఆమె ప్రయత్నాలు దాదాపు విజయవంతం అయ్యాయి.
♦ 2013 లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళా కవలలు - తాషి మరియు నుంగ్షి మాలిక్ లకు కూడా ఈ అవార్డును ప్రదానం చేశారు. వారు నుంగ్షి తాషి ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా ఉన్నారు.
♦ 2010 లో సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన కౌశికి చక్రవర్తికి కూడా 'నారి శక్తి పురష్కార్' లభించింది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్న సంగతి తెలిసిందే.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



