Top
logo

Ram Nath Kovind: కాశ్మీర్ చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

President Of India Ram Nath Kovind Reached to Kashmir For Four Days Tour
X

రాష్ట్రపతి కోవింద్ కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గౌరవ వందనం

Highlights

Ram Nath Kovind: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కాశ్మీర్ చేరుకున్న భారత రాష్ట్ర...

Ram Nath Kovind: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కాశ్మీర్ చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేరుకున్నారు. సాయంత్రం శ్రీనగర్ చేరుకున్న రాష్ట్రపతికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇక రేపు ద్రాస్‌వార్ మెమోరియల్ దగ్గర అమరవీరులకు రాష్ట్రపతి నివాళులు అర్పించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు.

ఇక రేపు కార్గిల్ విజయ్ దివస్‌ 22 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌తో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం రాష్ట్రపతి తిరిగి కాశ్మీర్ రానుండగా మంగళవారం కాశ్మీర్ యూనివర్శిటీ కాన్వొకేషకు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో 84 మంది విద్యార్థులకు పతకాలు, డిగ్రీలు పంపిణీ చేయనున్నారు. ఆయనతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కశ్మీర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తలాత్ అహ్మద్ కూడా హాజరుకానున్నారు.

Web TitlePresident Of India Ram Nath Kovind Reached to Kashmir For Four Days Tour
Next Story