Padma Awards: అట్టహాసంగా 2023 పద్మ అవార్డుల ప్రదానోత్సవం

President Droupadi Murmu Presents Padma Awards
x

Padma Awards: అట్టహాసంగా 2023 పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Highlights

Padma Awards: ఏపీకి చెందిన చింతలపాటి వెంకటపతిరాజు, సచ్చిదానందశాస్త్రిలకు పద్మాలు

Padma Awards: ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో పద్మా అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. దర్బార్ హాలులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మఅవార్డులను ప్రదానంచేసి. అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించారు. ఉపరాష్ట్రపతి ధన్‌కర్, ప్రధాని నరేంద్రమోడీలతోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యంతో పాటు విద్య, క్రీడలు, పౌర సేవ మొదలైన వివిధ రంగాలలో వారికి అవార్డులతో పౌరసత్కారం చేశారు.

కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ పద్మ విభూషన్ అందుకోగా.. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా, సింగర్ సుమన్ కళ్యాణ్‌పూర్‌ పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో కళారంగానికి చింతలపాటి వెంకటపతిరాజు, సచ్చిదానందశాస్త్రి, తెలంగాణలో వైద్యవిభాగంలో పసుపులేటి హన్మంతరావు, సాహిత్యంలో రామకృష్ణారెడ్డిలకు పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories