అమిత్‌ షాపై ప్రశాంత్‌ కిషోర్‌ కౌంటర్ ఎటాక్

అమిత్‌ షాపై ప్రశాంత్‌ కిషోర్‌ కౌంటర్ ఎటాక్
x
ప్రశాంత్ కిషోర్ , అమిత్ షా
Highlights

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో వరుస పరాజయాలతో నిరాశతో ఉన్న బీజేపీ.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో వరుస పరాజయాలతో నిరాశతో ఉన్న బీజేపీ. హస్తినాలో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓడించాలని ప్రత్యర్థలు కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఎన్నికల వ్యూహకర్త, జేడీయు ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి అసహనం లేదన్నారు.

కాగా.. ట్విటర్ వేదికగా స్పందించిన ప్రశాంత్‌ కిషోర్‌ ఢిల్లీపై ప్రేమతో ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్నేహభావానికి, సోదరభావానికి ఎలాంటి ప్రమాదం లేదని అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు . షహీన్‌బాగ్‌లో ప్రజలు సీఏఏకు వ్యతిరేకంగా శాంతియుంతంగా నిరసనలు తెలుపుతున్నారు. నిరసనలను వ్యతిరేకిస్తూ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వెయ్యాలని అమిత్ షా కోరారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా బీజేపీని గెలిపిస్తే షహీన్‌బాగ్‌ వంటి ఘటనలను అరికట్టవచ్చని, పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలను లక్ష్యంగా చేస్తూ ఎన్నికల ప్రచారంలో కొనసాగించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో షహీన్‌బాగ్‌లో జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ బీజేపీకి ఓటు వేసి వాటిని ప్రతిఘటించవచ్చని అమిత్‌ షా అన్నారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చారు.

ప్రశాంత్ కిషోర్ అవకాశం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వస్తున్నారు. సీఏఏ చట్టంపై కూడా ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో సీసీఏ అమలు చేయమని తెల్చిచెప్పారు. ఎన్నికల వ్యూహకర్తగాను ప్రస్తుతం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు రాజకీయ సలహాదారుడిగా ప్రశాంత్ కిషోర్ సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించాలని ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు రచిస్తున్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బీజేపీ వ్యూహకర్తగా పనిచేసిన సంగతి తెలిసిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories