తనతో పాటు మీడియా ముందుకు వచ్చి చర్చ జరపవచ్చని ప్రశాంత్ కిశోర్ ఛాలెంజ్‌

తనతో పాటు మీడియా ముందుకు వచ్చి చర్చ జరపవచ్చని ప్రశాంత్ కిశోర్ ఛాలెంజ్‌
x
Highlights

తమ పార్టీని సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూలో విలీనం చేయాలని.. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రతిపాదించారని...

తమ పార్టీని సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూలో విలీనం చేయాలని.. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రతిపాదించారని బిహార్‌ మాజీ సీఎం, ఆర్‌జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ భార్య రబ్రీదేవి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాఖ్యలపై బీహార్ లో తీవ్ర దుమారం రేగుతోంది. ప్రశాంత్ కిషోర్ పై ఆర్‌జేడీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై ప్రశాంత్‌ కిషోర్‌ సైతం ఘటుగా రిప్లై ఇచ్చారు.

లాలు కోరుకుంటే ఎప్పుడైనా తనతో పాటు మీడియా ముందుకు వచ్చి చర్చ జరపవచ్చని ఛాలెంజ్‌ చేశారు. మీడియా ముందు చర్చ జరిగితే ఎవరేంటో..ఆ రోజు ఏం జరిగిందో, ఎవరు ఎవరికి ఏం ఆఫర్‌ ఇచ్చారో ప్రజలకు తెలియజేయవచ్చు అని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్విట్‌ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు నిజాన్ని కాపాడుతున్నారా అని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories