గాడ్సేను దేశభక్తుడన్న ప్రజ్ఞా ఠాకూర్

గాడ్సేను దేశభక్తుడన్న ప్రజ్ఞా ఠాకూర్
x
PragyaThakur file photo
Highlights

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరో సారి తెరపైకి వచ్చారు.

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరో సారి తెరపైకి వచ్చారు.స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ రాజా మాట్లాడుతూ గాంధీని గాడ్సే ఎందుకు చంపారని వ్యాఖ్యానించాడు. దీంతో స్పందించిన ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గాడ్సే దేశభక్తుడని వారిని ఉదాహరణలుగా చెప్పొద్దంటూ బదులిచ్చారు.

అంతే కాక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది కాంగ్రెస్సేనని ఠాకూర్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రతిపక్షాల నాయకులు ఆందోళనకు దిగాయి. కాగా భోపాల్ ఎంపీ చేసిన వ్యాఖ్యలకి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మద్దతుగా నిలిచారు. గాడ్సే పేరును ప్రజ్ఞా ఉచ్ఛరించలేదని తెలిపారు. ''గాంధీ పట్ల తాను 32 ఏళ్లుగా పగ పెంచుకున్నానని, చివరకు హతమార్చానని గాడ్సే ఒప్పుకున్నాడు'' అని ఈ సంర్బంగా రాజా తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories