రైతు సంఘాలు- కేంద్రం మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా!

రైతు సంఘాలు- కేంద్రం మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా!
x
Highlights

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన భారత్ బంద్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తైంది. ఈ నేపథ్యంలో రైతు సంఘాలను చర్చలకు పిలిచారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన భారత్ బంద్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తైంది. ఈ నేపథ్యంలో రైతు సంఘాలను చర్చలకు పిలిచారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మంగళవారం సాయంత్రం నుంచి రైతు సంఘాలతో చర్చించిన ఆయన..ఇవాళ కేంద్రం ప్రతిపాదనలను పంపుతామని తెలిపారు. దీంతో ఇవాళ కేంద్రం- రైతు సంఘాల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఇక కేంద్రం ఇచ్చే ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ పేర్కొంది. ప్రతిపాదనలు అందిన తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది.

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత నెల 27 నుంచి రైతులు దేశ రాజధాని దిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఐదు దఫాలుగా కేంద్రం రైతు సంఘాలతో చర్చలు జరిపింది. అయితే ఆ చర్చలేవీ సఫలం కాకపోవటంతో ఇవాళ చర్చలు జరుపుతామని గతంలో రైతు సంఘాలను ఆహ్వానించింది కేంద్రం. అయితే సమావేశానికి ఒక్కరోజు ముందే అమిత్ షా రైతుసంఘాలతో భేటీ కావడంతో ఇవాళ్టి చర్చలు వాయిదా పడ్డాయి.

గతంలో పలుమార్లు చర్చలు జరిగినా అవేవీ ఫలితం ఇవ్వకపోవటంతో.. కేంద్రం ప్రతిపాదనలను ఈసారైనా రైతు సంఘాలు అంగీకరిస్తాయా..? లేక ఉద్యమం కొనసాగిస్తాయా అనేది చర్చనీయంగా మారింది. మరోవైపు రోజురోజుకూ రైతు నిరసనలు ఉధృతం అవుతున్న నేపథ్యంలో వారిని శాంతింపజేసేందుకు కేంద్రం ఎలాంటి ప్రతిపాదనలను వారి ముందు ఉంచుతుందో అనే ఆసక్తి నెలకొంది దేశప్రజల్లో.

Show Full Article
Print Article
Next Story
More Stories